close
సినిమా రివ్యూ
రివ్యూ: కబీర్ సింగ్‌

నటీనటులు: షాహిద్‌ కపూర్‌, కియారా అడ్వాణీ, అర్జన్‌ బాజ్వా, సురేశ్‌ ఒబెరాయ్‌, కామినీ కౌశల్‌, అదిల్‌ హుస్సేన్‌ తదితరులు
సంగీతం: మిథూన్‌
సినిమాటోగ్రఫీ: సంతాన కృష్ణన్‌, రవిచంద్రన్
కూర్పు: ఆరిఫ్‌ షేక్‌
నిర్మాణ సంస్థ: సినీ 1 స్టూడియోస్‌, టీ సిరీస్‌
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సందీప్‌ రెడ్డి వంగా

ఇటీవల కాలంలో ప్రకటించిన రీమేక్‌ సినిమాల్లో ‘కబీర్‌ సింగ్’ చిత్రం ఎక్కువగా ఆకట్టుకుంది. విజయ్‌ దేవరకొండ-సందీప్‌ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌ బస్టర్‌ చిత్రం ‘అర్జున్‌రెడ్డి’కి ఇది రీమేక్‌. ఈ సినిమాకు కూడా సందీప్‌ రెడ్డినే దర్శకత్వం వహించడం విశేషం. షాహిద్‌ కపూర్‌, కియారా అడ్వాణీ జంటగా నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో ‘అర్జున్‌రెడ్డి’ రికార్డు సృష్టించినట్లు.. బాలీవుడ్‌లోనూ క్రియేట్‌ చేస్తుందా? చూద్దాం.

కథేంటంటే: కబీర్‌ రాజ్‌ధీర్‌ సింగ్‌ (షాహిద్‌ కపూర్‌) ఓ వైద్య విద్యార్థి. అతను చదువుతున్న కాలేజ్‌లోనే చేరుతుంది ప్రీతి శర్మా (కియారా అడ్వాణీ). ప్రీతిని చూడగానే ఇష్టపడతాడు కబీర్‌. ప్రీతి కూడా కబీర్‌ను ప్రేమిస్తుంది. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. ఇంతలో ప్రీతికి ఇంట్లో వారు సంబంధాలు చూస్తారు. ఈ విషయం కబీర్‌కు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? కబీర్‌, ప్రీతి ఒక్కటయ్యారా? తదితర విషయాలు తెరపై చూడాలి.

ఎలా ఉందంటే: ‘అర్జున్‌రెడ్డి’ సినిమా చూసినవారికి ఈ కథ సుపరిచితమే. అయితే హిందీ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సినిమాను తెరకెక్కించారు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా. అందులోనే ఆయన పనితనం కనబడుతోంది. ‘అర్జున్‌రెడ్డి’ కథ తెలిసినప్పటికీ ప్రేక్షకులకు ‘కబీర్‌ సింగ్’ కొత్తగానే ఉంటుంది. రీమేక్‌ సినిమా అయినప్పటికీ అక్కడక్కడా కొన్ని మార్పులు చేశారు. హీరో తల్లి పాత్రను మార్చారు. ఆమెను సినిమాలోనూ ఓ నటిగా చూపించారు. సినిమాను పూర్తిగా కాపీ కొట్టలేదని, చేసిన మార్పులేంటో సినిమా చూసే తెలుసుకోవాలని ఒకానొక సందర్భంలో దర్శకుడు సందీప్‌రెడ్డి వెల్లడించారు. హిందీ ప్రేక్షకుల్లో దాదాపు 90 శాతం మంది ‘అర్జున్‌రెడ్డి’ సినిమాను చూసి ఉండరు కాబట్టి.. ‘కబీర్‌ సింగ్’కు వారు ఫిదా అవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. అక్కడక్కడా మీరిన ముద్దు సన్నివేశాలు ప్రేక్షకుడిని కాస్త ఇబ్బందికి గురిచేస్తాయి. మిథూన్‌ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు సంస్థలకు తగ్గట్టుగా రిచ్‌గా ఉన్నాయి.

ఎవరెలా చేశారంటే: సినిమాలో షాహిద్‌ కపూర్‌, కియారా అడ్వాణీ కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. షాహిద్‌ తన నటనతో బాలీవుడ్‌ విజయ్‌ దేవరకొండ అని నిరూపించుకున్నారు. కియారా అడ్వాణీ ప్రతి సన్నివేశంలో అందంగా కనిపించారు. చక్కటి హావభావాలు పలికించారు. షాహిద్‌కు సోదరుడిగా నటించిన అర్జన్‌ బాజ్వా తన పాత్రకు నూరు శాతం న్యాయం చేశారు. సొంత తమ్ముడ్ని కోల్పోతున్నట్లుగా ఆయన నటించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మిగతా వారంతా తమ పాత్రల పరిధి మేర చక్కగా నటించారు.

బలాలు
+ షాహిద్‌, కియారా కెమిస్ట్రీ
+ పాటలు
+ నిర్మాణ విలువలు
బలహీనతలు
- మితిమీరిన ముద్దు సన్నివేశాలు

చివరగా: ‘కబీర్‌సింగ్’.. ఆకట్టుకుంటాడు!
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

 


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.