close
గుస‌గుస‌లు
‘భారతీయుడు 2’ పట్టాలెక్కేది అప్పుడేనా?

కమల్‌ హాసన్‌ - శంకర్‌ల ‘భారతీయుడు 2’ అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. బడ్జెట్‌  సమస్యల వల్లే ఈసినిమా ముందుకు సాగడం లేదని చెన్నై వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమా ఉండదేమో అనుకుంటున్న తరుణంలో.. ‘భారతీయుడు 2’పై కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. జూన్‌లో ఈ సినిమా పట్టాలెక్కడం ఖాయమని సమాచారం. దర్శకుడు, నిర్మాత... ఇద్దరూ కూర్చుని బడ్జెట్‌పై ఓ అవగాహనకు వచ్చారని, ఈ సినిమాని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఖర్చుని తగ్గించే పనిలో భాగంగా కథలో కొన్ని కీలకమైన మార్పులు చేశారని తెలుస్తోంది. ఇది వరకే ‘భారతీయుడు 2’కి సంబంధించి కొంత మేర షూటింగ్‌ జరిగింది. కాజల్‌ నాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 2021లో విడుదల చేసే అవకాశాలున్నాయి.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.