close
గుస‌గుస‌లు
మూడోసారి?

రామ్‌ - కిషోర్‌ తిరుమల ఇద్దరూ హ్యాట్రిక్‌ కొట్టడానికి సిద్ధమయ్యారా?  అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ‘నేను శైలజ’తో  దర్శకుడిగా పరిచయం అయ్యారు కిషోర్‌ తిరుమల. ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వీరిద్దరి  కాంబినేషన్‌లో వచ్చిన ‘ఉన్నది ఒకటే జిందగీ’ ఫర్వాలేదనిపించింది. ఇప్పుడు మరోసారి ఇద్దరూ కలసి పనిచేయడానికి సిద్ధమైనట్టు సమాచారం. ఈసారి ఓ తమిళ చిత్రాన్ని రీమేక్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. స్రవంతి మూవీస్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుందని సమాచారం. ప్రస్తుతం రామ్‌ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో బిజీగా ఉన్నారు. జూన్‌లో ఈ చిత్రం విడుదల కానుంది. ఆ తరవాతే కొత్త సినిమా పట్టాలెక్కుతుంది.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.