close
గుస‌గుస‌లు
ఆ ఇద్దరిలో ఎవరితో?

సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా గీతా ఆర్ట్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కించనుంది. మారుతి దర్శకుడు. ఈనెలాఖరు నుంచి హైదరాబాద్‌లో చిత్రీకరణ మొదలెడతారు. కథానాయిక ఎవరన్నది ఇంత వరకూ తేలలేదు. అయితే ఇద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. నిధి అగర్వాల్‌, రుక్సార్‌ థిల్లాన్‌.. ఈ ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ‘సవ్యసాచి’, ‘మిస్టర్‌ మజ్ను’ చిత్రాల్లో నాయికగా కనిపించింది నిధి. ఇప్పుడు ‘ఇస్మార్ట్‌ శంకర్‌’లోనూ నటిస్తోంది. ‘ఏబీసీడీ’లో మెరిసింది రుక్సార్‌. మరి వీరిలో ఆ ఛాన్స్‌ ఎవరికొస్తుందో చూడాలి. మారుతి చిత్రాలు వినోద ప్రధానంగా సాగుతాయి. కుటుంబ బంధాలకూ చోటుంటుంది. ఈసారీ అదే పంథాలో కథని తయారు చేసుకున్నారని తెలుస్తోంది. ‘ప్రతిరోజూ పండగే’, ‘భోగి’ అనే పేర్లు పరిశీలనలో ఉన్నాయి. 2020 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.