close
గుస‌గుస‌లు
ఈ జోడీ మరోసారి?

విజయవంతమైన జోడీగా పేరు తెచ్చుకున్నారు బాలకృష్ణ - శ్రియ. ‘చెన్నకేశవరెడ్డి’లో తొలిసారి కలిసి నటించిన వీరిద్దరూ ఆ తర్వాత ‘విజయేంద్రవర్మ’, ‘గౌతమి పుత్ర శాతకర్ణి’, ‘పైసా వసూల్‌’చిత్రాల్లో నటించారు. ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’లోనూ మెరిసింది శ్రియ. తాజాగా ఈ జంట మరోసారి కలిసి సందడి చేయబోతోందని సమాచారం. బాలకృష్ణ కథానాయకుడిగా కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సి.కల్యాణ్‌ నిర్మిస్తున్నారు. వచ్చే నెల్లో పట్టాలెక్కనున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన శ్రియని ఎంపిక చేసే  అవకాశాలున్నాయి. ఆ మేరకు చిత్రబృందం చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. మరో నాయికకీ చోటుందని, ఆ ఎంపిక పూర్తయ్యాక చిత్రాన్ని సెట్స్‌పైకి  తీసుకెళతారని తెలుస్తోంది.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.