close
గుస‌గుస‌లు
నాగచైతన్య సరసన కీర్తి?

నాగార్జున కథానాయకుడిగా నటించిన ‘సోగ్గాడే చిన్నినాయనా’కి కొనసాగింపుగా ‘బంగార్రాజు’  తెరకెక్కబోతోంది. త్వరలోనే ఆ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తొలి చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు కల్యాణ్‌కృష్ణ కురసాల ఇప్పటికే ‘బంగార్రాజు’ స్క్రిప్టుని పూర్తిస్థాయిలో సిద్ధం చేసినట్టు సమాచారం. ప్రస్తుతం నటీనటులు ఎంపికపై కసరత్తులు  జరుగుతున్నాయి. చిత్రంలో నాగార్జునతో పాటు ఆయన తనయుడు నాగచైతన్య కూడా ఓ పూర్తిస్థాయి పాత్రలో సందడి చేయబోతున్నారు. నాగచైతన్య సరసన కథానాయికగా కీర్తి సురేష్‌ని ఎంపిక చేస్తున్నట్టు  సమాచారం. ప్రస్తుతం చిత్రబృందం ఆమెతో సంప్రదింపులు జరుపుతోంది. ‘మహానటి’ తర్వాత కొన్నాళ్లు తమిళంలోనే బిజీగా గడిపిన కీర్తి ప్రస్తుతం తెలుగుపై దృష్టి పెట్టింది. కథానాయిక ప్రాధాన్యమున్న ఓ చిత్రంతో పాటు ‘మన్మథుడు 2’లో కీలక పాత్ర పోషిస్తోంది. ‘బంగార్రాజు’ని సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.