close
గుస‌గుస‌లు
‘పింక్‌’ రీమేక్‌లో బాలయ్య?

హైదరాబాద్‌: హిందీ బ్లాక్‌బస్టర్‌ ‘పింక్‌’ను తెలుగులోనూ తెరకెక్కించేందుకు దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ రీమేక్‌లో అమితాబ్‌ బచ్చన్‌ పాత్రను బాలకృష్ణతో చేయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. నిర్మాత దిల్‌రాజు ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారట. ఈ మేరకు తెగ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది. మరోపక్క బాలయ్య, దిల్‌రాజు కాంబినేషన్‌లో ఓ సినిమా రావడం ఖాయమని చెబుతున్నారు. మరి ఆ ప్రాజెక్టు ఇదే అవుతుందా? లేక మరేదైనా కొత్త కథతో వస్తారా? అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.

‘పింక్‌’ తమిళ రీమేక్‌ను అజిత్‌తో తీస్తున్నారు. చిత్రీకరణ దాదాపు పూర్తయింది. ‘నేర్‌కొండ పార్‌వై’ టైటిల్‌తో బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో అజిత్‌పాటు శ్రద్ధా శ్రీనాథ్, విద్యా బాలన్‌ నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి ఆదరణ లభించింది.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.