close
గుస‌గుస‌లు
మురళీధరన్‌ బయోపిక్‌లో సచిన్‌?

చెన్నై: శ్రీలంకకు చెందిన ప్రముఖ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ జీవితాధారంగా కోలీవుడ్‌లో ఓ బయోపిక్‌ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రీల్‌ లైఫ్ మురళీధరన్‌ పాత్రలో విజయ్‌ సేతుపతి నటించనున్నారు. శ్రీపతి రంగసామి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌ అతిథి పాత్రలో కన్పించనున్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. మురళీధరన్‌, సచిన్‌కు మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయి. వీరిద్దరూ మ్యాచ్‌ ఆడుతున్నప్పుడు జరిగిన ఏదైనా ఓ ఆసక్తికర సంఘటనను సినిమాలో చూపించనున్నారట. అయితే ఈ గుసగుసలపై చిత్రబృందం స్పందించాల్సి ఉంది. సురేశ్‌ ప్రొడక్షన్స్‌, దార్‌ ఫిలింస్‌ సంయుక్తంగా సినిమాను నిర్మించనున్నాయి. 2020 నుంచి ఈ సినిమా చిత్రీకరణ మొదలవుతుంది.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.