close
గుస‌గుస‌లు
‘డియర్‌ కామ్రేడ్‌’ రీమేక్‌కి నో చెప్పిన హీరో!

ముంబయి: విజయ్‌ దేవరకొండ నటించిన ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమా హిందీ హక్కుల్ని ప్రముఖ బాలీవుడ్‌ దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సినిమా విడుదలకు ముందే ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు. ఇది ఓ అందమైన ప్రేమకథ అని, తనకు బాగా నచ్చిందని ట్వీట్‌ చేశారు. అయితే ఈ సినిమా రీమేక్‌కు బాలీవుడ్‌ నటుడు షాహిద్‌ కపూర్‌ను ఎంపికచేసుకోవాలని కరణ్‌ అనుకున్నారట. సినిమా కోసం షాహిద్‌ రూ.40 కోట్లు పారితోషికంగా అడిగినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ఇప్పుడు ఈ రీమేక్‌లోనే నటించనని షాహిద్‌ అన్నారట. ఈ మేరకు బాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ‘అర్జున్‌రెడ్డి’ రీమేక్‌లో షాహిద్‌ నటించారు. ఇప్పుడు ‘డియర్‌ కామ్రేడ్‌’ రీమేక్‌ చేస్తే ప్రేక్షకులను ఆకట్టుకోదేమోనన్న ఉద్దేశంతోనే సినిమాకు ‘నో’ చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.


 


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.