close
గుస‌గుస‌లు
రైతుగా కనిపించనున్న శర్వానంద్‌?

హైదరాబాద్‌: ప్రముఖ నటుడు శర్వానంద్‌ నటించనున్న చిత్రం ‘శ్రీకారం’. కిశోర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్‌ రైతు పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. వ్యవసాయ ప్రథానాంశంగా సాగనున్న ‘శ్రీకారం’ సినిమాలో శర్వానంద్‌ రైతు పాత్రలో కనిపించనున్నారని ఫిలిం వర్గాలు అంటున్నాయి. త్వరలో హైదరాబాద్‌లో ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సంబంధించి ఎక్కువ భాగం తిరుపతి, అనంతపురంలో తెరకెక్కించనున్నారు. ఈ వదంతులపై చిత్రబృందం నుంచి స్పందన రావాల్సి ఉంది. రామ్‌ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాకి మిక్కీ జే మేయర్‌ సంగీతం అందించనున్నారు. మరోవైపు శర్వానంద్‌ తమిళంలో మంచి విజయం అందుకున్న ‘96’ రీమేక్‌తో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన ‘రణరంగం’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.