close
గుస‌గుస‌లు
రజనీ దర్బార్‌లో జరుగుతోంది అదేనా?

కోడంబాక్కం, న్యూస్‌టుడే: ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ నటిస్తున్న చిత్రం ‘దర్బార్‌’. నయనతార కథానాయిక. యోగిబాబు హాస్యపాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా రెండో షెడ్యూల్‌ను ముంబయిలో తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తదుపరి షెడ్యూల్‌ను పుణెలో తెరకెక్కిస్తున్నారు. ఇక్కడ క్లైమాక్స్‌కు సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇక్కడ తెరకెక్కించనున్న సన్నివేశాల కోసమే రజనీకాంత్‌ పుణె వెళ్లిన విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్‌ పూర్తయితే పాటలు మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. పాటలన్నింటినీ విదేశాల్లో తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో రజనీకాంత్‌ పోలీసు అధికారిగా నటిస్తున్న విషయం తెలిసిందే. మిగిలిన వివరాలను మరింత గోప్యంగా ఉంచుతున్నారు. అయినప్పటికీ ఒకటి రెండు ఫొటోలు లీకవడం చిత్ర బృందం ఆశ్చర్యానికి గురవుతోంది. ఇదిలా ఉండగా త్వరలోనే సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. 


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.