close
గుస‌గుస‌లు
‘అల..వైకుంఠపురములో’ ఎన్టీఆర్‌ సినిమానా..?

హైదరాబాద్‌: స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ చిత్ర కథకు అలనాటి ఎన్టీఆర్‌ చిత్రం ‘ఇంటిగుట్టు’కీ పోలికలున్నట్లు సినీవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మాటల మాంత్రికుడు ఆ చిత్ర కథనే నేటి తరానికి తగ్గట్లుగా పూర్తిగా మార్చి తెరకెక్కిస్తున్నట్లు సమాచారం అందుతోంది. మరి వీటిలో వాస్తవమెంతన్నది తెలియాలంటే త్రివిక్రమ్‌ మనసు విప్పే వరకు వేచి చూడక తప్పదు.

‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ వంటి హిట్‌ చిత్రాల తర్వాత బన్నీ-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా ఇది. ఇందులో బన్నీకి జంటగా పూజా హెగ్డే నటిస్తున్నారు. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.