close
గుస‌గుస‌లు
రజనీకాంత్‌ చిత్రంలో మీనా..?

చెన్నై: ‘ముత్తు’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది రజనీకాంత్-మీనా‌ జోడి. ఈ సినిమా తర్వాత వీరిద్దరు కలిసి పలు తమిళ చిత్రాల్లో నటించారు. తాజాగా రజనీ, మీనా  మరోసారి వెండితెరపై సందడి చేయనున్నారని కోలీవుడ్‌లో టాక్‌. రజనీ 168వ చిత్రాన్ని దర్శకుడు శివ తెరకెక్కించబోతున్నాడనే విషయం తెలిసిందే. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో మీనా కీలకపాత్రలో కనిపించనున్నారట. తాజా సమాచారం ప్రకారం రజనీ168గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని దర్శకుడు శివ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించనున్నారట. ఇప్పటికే ఆయన చిత్రీకరణకు సంబంధించిన విశేషాలతోపాటు, నటీనటులకు సంబంధించిన విశేషాలపై ఇతర చిత్రబృందంతో చర్చలు జరుపుతున్నారట. ఈ సినిమాలో రజనీకాంత్‌ భార్యగా ఖుష్బూ, ఆయన కుమార్తెగా కీర్తి సురేశ్‌ నటించనున్నారని ఇప్పటికే కొన్ని వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా ఈ సినిమాలో నాటి తార మీనా సైతం ఓ కీలకపాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఈ సినిమాలో తమిళ హాస్య నటుడు సూరి ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు చిత్రబృందం ఇటీవల ప్రకటించింది. దీంతో సూరి ఈ చిత్రబృందానికి కృతజ్ఞతలు తెలిపారు. దీనికి సంబంధించి ఓ స్పెషల్‌ వీడియోను సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘నేను ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న నా కల సాకారం అయ్యే రోజు వచ్చింది. రజనీకాంత్‌ సర్‌తో సెల్ఫీ తీసుకుంటేనే నేను చంద్రుడిపై తేలిపోయేవాడిని. ఇప్పుడు ఆయన పక్కన నటించే అవకాశాన్ని సొంతం చేసుకున్నాను. నాకెంతో సంతోషంగా ఉంది. ఇంతంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన రజనీకాంత్‌కు ధన్యవాదాలు’ అని ఆయన తెలిపారు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.