close
గుస‌గుస‌లు
ముచ్చటగా మూడోసారి ప్రభాస్‌తో కాజల్‌? 

హైదరాబాద్‌: రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌- అందాల ‘చందమామ’ కాజల్‌ జోడీకి టాలీవుడ్‌లో ఓ క్రేజ్‌ ఉంది. వీరిద్దరు జంటగా నటించిన ‘డార్లింగ్’, ‘మిస్టర్‌ ఫర్‌ఫెక్ట్‌’ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకున్నాయి. తాజాగా ఈ జంట మరోసారి వెండితెరపై సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ‘జిల్‌’ ఫేం రాధాకృష్ణన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదొక వింటేజ్‌ లవ్‌స్టోరీ. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుంది. ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఇందులో పూజా హెగ్డేతో పాటు కాజల్‌ కూడా నటించనున్నారట. కాజల్‌ ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తారని వినికిడి. పునర్జన్మల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలోని కీలక సన్నివేశాల్లో ప్రభాస్‌ సరసన కాజల్‌ దర్శనమివ్వబోతున్నారని టాలీవుడ్‌ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. దీనిపై ఇంకా చిత్రబృందం నుంచి అధికారి ప్రకటన వెలువడలేదు. 


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.