close
కొత్త సినిమాలు
‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’లో లక్ష్మీ పార్వతిని చూశారా!

ఫస్ట్‌లుక్‌ విడుదల చేసిన వర్మ

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’లో లక్ష్మీ పార్వతిని చూశారా!

హైదరాబాద్‌: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌’ సినిమాలో లక్ష్మీ పార్వతిగా ఎవరు కనిపించబోతున్నారని చాలా రోజులుగా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో అనేక మంది నటీమణుల పేర్లు బయటికి వచ్చాయి. అయితే ఆ పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌‌ను దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ శుక్రవారం విడుదల చేశారు. సినిమాలో కన్నడ నటి యజ్ఞా శెట్టి టైటిల్‌ పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు. ఆమె గతంలో వర్మ తీసిన ‘కిల్లింగ్‌ వీరప్పన్‌’ సినిమాలో వీరప్పన్‌ భార్య ముత్తులక్ష్మి పాత్రలో నటించారు. ఓ కన్నడ చిత్రానికి గానూ ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డును కూడా అందుకున్నారు.

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’లో లక్ష్మీ పార్వతిని చూశారా!

అదేవిధంగా ఈ సినిమాలో నారా చంద్రబాబు నాయుడు పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను కూడా వర్మ విడుదల చేశారు. లక్ష్మీ పార్వతి, ఎన్టీఆర్‌ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు వర్మ తెలిపారు. ఇప్పటికే ఈ సినిమాలోని రెండు పాటల్ని ఆయన విడుదల చేశారు. ‘వెన్నుపోటు’ అనే పాటను వ్యతిరేకిస్తూ తెదేపా నేతలు ఆరోపణలు కూడా చేశారు.

ఈ సినిమాకు ఎమ్‌.ఎమ్‌. కీరవాణి సోదరుడు కల్యాణ్‌ మాలిక్‌ సంగీతం అందిస్తున్నారు. రాకేష్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జనవరి 24న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు వర్మ ఇప్పటికే ప్రకటించారు. మరోపక్క ఈ సినిమాలోని పాటలు తనను చాలా బాధించాయని ఇటీవల మీడియాతో లక్ష్మీ పార్వతి అన్నట్లు సమాచారం.

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’లో లక్ష్మీ పార్వతిని చూశారా!


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.