close
కొత్త సినిమాలు
రికార్డు సృష్టించిన ప్రభాస్‌ సర్‌ప్రైజ్‌!

హైదరాబాద్‌: యంగ్‌ రెబెల్‌ స్టార్‌ ప్రభాస్‌ మంగళవారం అభిమానులకు ఇచ్చిన సర్‌ప్రైజ్‌ రికార్డు సృష్టించింది. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ‘సాహో’ సినిమాలోని ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ను విడుదల చేశారు. 24 గంటల్లో ఈ పోస్టర్‌ దాదాపు ఎనిమిది లక్షల లైక్‌లను సొంతం చేసుకుంది. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా పోస్టర్‌కూ 24 గంటల్లో ఇన్ని లక్షల లైక్స్‌ రాలేదని సినీ విశ్లేషకులు తెలిపారు. ఇందుకు కారణం ప్రభాస్‌ కొత్తగా కనిపిస్తుండడం, అదీకాకుండా ‘బాహుబలి’ సినిమా తర్వాత వస్తున్న చిత్రం కావడమేనని అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్లు, పోస్టర్లకే ఇంతటి స్పందన వస్తోందంటే.. ఇక సినిమా ఏ స్థాయిలో ఉంటుందో వేచి చూడాలి.

సుజిత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌ కథానాయికగా నటించారు. నీల్‌ నితిన్‌ ముఖేశ్‌ ప్రతినాయకుడి పాత్ర పోషించారు. ప్రస్తుతం ముంబయిలో చిత్రీకరణ జరుగుతోంది. ఆగస్ట్‌15న సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.