close
కొత్త సినిమాలు
రానా.. గుణశేఖర్‌... ‘హిరణ్యకశ్యప’

మూడేళ్లుగా ప్రీ-ప్రొడక్షన్‌ పనులు

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌ తన తదుపరి ప్రాజెక్టును ప్రకటించారు. ‘రుద్రమదేవి’ సినిమా తర్వాత విరామం తీసుకున్న ఆయన ‘హిరణ్యకశ్యప’ అనే టైటిల్‌తో సినిమా తెరకెక్కించనున్నారు. ఇందులో రానా కథానాయకుడి పాత్ర పోషించడం విశేషం. ఈ మేరకు శనివారం ప్రకటన చేశారు. రానాతో కలిసి ఎగ్జైటింగ్‌ ప్రయాణం మొదలైందని గుణశేఖర్‌ ట్వీట్‌ చేశారు. గత మూడేళ్లుగా ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయని అన్నారు. త్వరలోనే పూర్తి వివరాల్ని వెల్లడిస్తామని చెప్పారు.

ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యక‌శ్యప‌. విష్ణుమూర్తి ద్వేషి అయిన ఈ రాక్షస‌రాజు సంహారం కోస‌మే మ‌హా విష్ణువు న‌ర‌సింహా అవ‌తారం ఎత్తారు. ఇప్పుడు ఈ పౌరాణిక కథతో గుణశేఖర్‌ సినిమా తీయబోతున్నట్లు తెలుస్తోంది.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.