Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 108971
            [news_title_telugu_html] => 

అల్లు అర్జున్‌తో ‘చిత్రలహరి’ భామ

[news_title_telugu] => అల్లు అర్జున్‌తో ‘చిత్రలహరి’ భామ [news_title_english] => Nivetha Pethuraj in Allu arjun film [news_short_description] => కథానాయకుడు అల్లు అర్జున్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే కథానాయిక. ఇందులో యువ కథానాయకుడు సుశాంత్‌ .... [news_tags_keywords] => Nivetha Pethuraj,Allu arjun ,trivikram [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [news_sections] => ,0205, ) )
అల్లు అర్జున్‌తో ‘చిత్రలహరి’ భామ - Nivetha Pethuraj in Allu arjun film - EENADU
close
కొత్త సినిమాలు
అల్లు అర్జున్‌తో ‘చిత్రలహరి’ భామ

హైదరాబాద్‌: కథానాయకుడు అల్లు అర్జున్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే కథానాయిక. ఇందులో యువ కథానాయకుడు సుశాంత్‌ నటించబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కాగా కోలీవుడ్‌లో గుర్తింపు పొందిన నివేదా పేతురాజ్‌ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నట్లు యూనిట్‌ ప్రకటించింది. ఈ మేరకు ఆమెకు స్వాగతం చెబుతూ ట్వీట్‌ చేసింది. నివేదా ఇటీవల ‘చిత్రలహరి’ సినిమాలోని కీలక పాత్రలో కనిపించారు. సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఇప్పుడు తెలుగులో ఆమె నటిస్తున్న రెండో సినిమా ఇది.

బన్నీ 19వ సినిమాగా ఇది రూపొందుతోంది. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ పతాకాలపై ఎస్‌. రాధాకృష్ణ, అల్లు అరవింద్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్‌ స్టార్‌ నానా పటేకర్‌ నటించే అవకాశాలు ఉన్నట్లు ఇటీవల ప్రచారం జరిగింది.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.