close
కొత్త సినిమాలు
ప్రభాస్‌ నిజ జీవితంలోనూ బాహుబలే!

హైదరాబాద్‌: కథానాయకుడు ప్రభాస్‌ నిజ జీవితంలోనూ బాహుబలేనని ప్రముఖ నటుడు మురళీ శర్మ అన్నారు. ప్రభాస్‌ నటిస్తున్న సినిమా ‘సాహో’. ఈ సినిమాలో మురళీ శర్మ కీలక పాత్ర పోషించారు. ఇందులో అవకాశం గురించి ఆయన తాజాగా మీడియాతో మాట్లాడారు. ‘మన తరంలో ఇది అతి పెద్ద యాక్షన్‌ ఫిల్మ్. తనకు ఏం కావాలో, దాన్ని ఎలా రాబట్టుకోవాలో దర్శకుడు సుజీత్‌కు బాగా తెలుసు. ఈ సినిమా వల్ల నిజ జీవితంలోనూ బాహుబలి అయిన ప్రభాస్‌తో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. ఓ గొప్ప స్క్రిప్టుతో మీ ముందుకు రాబోతున్నాం’ అని ఆయన అన్నారు.

మరోపక్క గురువారం ఉదయం 11.23 గంటలకు ‘సాహో’ టీజర్‌ విడుదల కాబోతోంది. ఈ ప్రచార చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు చిత్ర బృందం బుధవారం ప్రభాస్‌ యాక్షన్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌ కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. వెన్నెల కిశోర్‌, జాకీ ష్రాఫ్‌, అరుణ్‌ విజయ్‌, మందిరా బేడీ, చుంకీ పాండే తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 15న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.