close
కొత్త సినిమాలు
నీ గొప్ప కోసం ఇతరుల పరువెందుకు తీస్తావ్‌?

‘పింక్‌’ రీమేక్‌ ట్రైలర్‌.. ఆకట్టుకుంటోన్న అజిత్‌ నటన

చెన్నై: బాలీవుడ్‌ హిట్‌ ‘పింక్‌’ను తమిళంలో ‘నేర్కొండపార్వాయ్‌’ టైటిల్‌తో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో అమితాబ్‌ బచ్చన్‌ పాత్రలో అజిత్‌ నటిస్తున్నారు. వినోద్‌ దర్శకుడు. విద్యా బాలన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. బోనీ కపూర్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రద్ధ శ్రీనాథ్‌, అభిరామి వెంకటాచలమ్‌, ఆండ్రియా, అధిక్‌ రవిచంద్రన్‌, అర్జున్‌ చిదంబరం, అశ్విన్‌ రావు, సుజిత్‌ శంకర్‌ ముఖ్య భూమికల్లో కనిపించనున్నారు. దివంగత నటి శ్రీదేవి కోరిక మేరకు అజిత్‌తో బోనీ ఈ సినిమా తీస్తున్నారు.

ఈ చిత్రం ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు. అజిత్‌ న్యాయవాది పాత్రలో ఒదిగిపోయారు. ఆయన లుక్‌, డైలాగ్‌ డెలివరీ అభిమానుల్ని ఆకట్టుకుంది. ‘నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి ఇతరుల పరువు ఎందుకు తీస్తున్నావు?’ అంటూ అజిత్‌ ఓ పోలీసు అధికారిణిని ప్రశ్నిస్తున్న డైలాగ్‌తో ట్రైలర్‌ ముగిసింది. ఆద్యంతం ఆసక్తికరంగా ఈ ప్రచార చిత్రాన్ని రూపొందించారు. దాదాపు అన్ని సన్నివేశాలు కోర్టులోనే జరిగాయి. ఓ కేసును విచారించే నేపథ్యంలో సాగే కథ ఇది. 

 


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.