close
కొత్త సినిమాలు
‘గ్యాంగ్‌లీడర్‌’ ఫస్ట్‌లుక్‌ చూశారా!

దేనికోసం చూస్తున్నారో..

హైదరాబాద్‌: నేచురల్‌ స్టార్‌ నాని కథానాయకుడిగా నటిస్తున్న ‘గ్యాంగ్‌ లీడర్‌’ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. ఇందులో నానితోపాటు నలుగురు మహిళలు, ఓ పాప కనిపించారు. వారంతా మేడపై నిల్చుని బైనాక్యులర్‌ పట్టుకుని దేన్నో చూస్తున్నారు. ‘బామ్మ, వరలక్ష్మి, ప్రియ, స్వాతి, చిన్ను..’ అని నాని వారి పాత్రలను ట్విటర్‌ ద్వారా పరిచయం చేశారు. ఆసక్తికరంగా ఉన్న ఈ ఫస్ట్‌లుక్‌ అభిమానుల్ని ఆకట్టుకుంది.

‘హలో’ తర్వాత విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. అనిరుధ్‌ బాణీలు అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రం మొదటి పాటను జులై 18న, టీజర్‌ను జులై 24న విడుదల చేయబోతున్నారు. ఆగస్టు 30న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మరోపక్క నాని ‘వి’ చిత్రంలో నటిస్తున్నారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుధీర్‌బాబు మరో కథానాయకుడిగా కనిపించనున్నారు. నివేధా థామస్‌, అదితిరావు హైదరి కథానాయికలు. దిల్‌రాజు నిర్మిస్తున్నారు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.