close
కొత్త సినిమాలు
‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది

హైదరాబాద్‌: యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ మరో సరికొత్త పాత్రతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు. ‘డియర్‌ కామ్రేడ్‌’ తర్వాత ఆయన నటిస్తున్న సినిమా ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ఉన్న ఈ పోస్టర్‌లో విజయ్‌ విభిన్నంగా కనిపించారు. చేతిలో సిగరెట్‌, నోటిలో నుంచి పొగ వదులుతూ.. ముఖానికి రక్తంతో కనిపించారు. ఈ ప్రచార చిత్రం ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.

‘మళ్లీ మళ్లీ ఇదిరాని రోజు’ ఫేం క్రాంతి మాధవ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్‌, కేథరిన్‌, ఇజబెల్లె లైట్ కథానాయికలు. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాను కేఎస్‌ రామారావు సమర్పించనున్నారు. గోపీ సుందర్‌ బాణీలు అందించనున్నారు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.