close
ఇంటర్వ్యూ
రామ్‌ పెళ్లి ఎప్పుడు?

ట్విటర్‌లో ఫ్యాన్స్‌తో హీరో ముచ్చట్లు

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో కలిసి పనిచేయడం కిక్‌ ఇచ్చిందని యువ కథానాయకుడు రామ్‌ అన్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘ఇస్మార్ట్‌ శంకర్‌’. నభా నటేష్‌, నిధి అగర్వాల్‌ కథానాయికలు. మణిశర్మ బాణీలు అందించారు. ఈ సినిమా విడుదల నేపథ్యంలో రామ్‌ ట్విటర్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ స్టైల్‌లో సమాధానాలు చెప్పారు. ఆ విశేషాలివి..
అన్న విజయవాడలో నీకు సొంత తమ్ముడు ఒక్కడు ఉన్నాడు. కేవలం నీ సినిమాలు మాత్రమే చూస్తాడు. నిన్ను మాత్రమే ఇష్టపడేవాడు. వాడే నేను.. నీ స్టైల్‌లో హాయ్‌ చెప్పవా?
రామ్‌: నాలాంటి తమ్ముళ్లకి ప్రాణం ఇచ్చేశా.. తీసుకో (ముద్దుపెడుతున్న ఎమోజీ)
ఇవాళ మమ్మల్ని హెచ్చరిస్తూ ఓ మెసేజ్‌ చేశావ్‌. బ్యాడ్‌బాయ్‌ను కొత్తగా చూపిస్తారు?
రామ్‌: ఇది సినిమా రా భాయ్‌.. ‘సీన్‌ చూడండి. సీన్‌ చేయకండి’ అని సింపుల్‌గా చెప్పా.
అన్నా మీరు ఆరు నెలలు కష్టపడి సినిమా తీశారు కదా. మేం రెండు గంటల్లో మీ కష్టాన్ని మొత్తం చూడొచ్చా?
రామ్‌: కష్టాన్ని చూసి ఏం చేస్తావ్‌ తమ్మి.. మీ కోసం మేం సినిమాను ఎంత ప్రేమతో తీశామో చూడు. ఎంజాయ్‌ చేయ్‌.

పూరీ జగన్నాథ్‌తో పనిచేయడం ఎలా అనిపించింది?
రామ్‌: అదోరకమైన సుఖం.. చెప్పాగా కిక్‌ అని..
‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో యాక్టింగ్‌‌, డ్యాన్స్‌, ఫైట్స్‌, రొమాన్స్‌.. అన్ని కవర్‌ చేసేశావ్‌. చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా ఓ ట్రీట్‌లా ఉంటుంది.
రామ్‌: మీ కోసం ఎక్కడా తగ్గేదిలేద్‌.
మీరు పోషించిన అన్ని పాత్రల్లో ఏదంటే ఇష్టం?
రామ్‌: ఉస్తాద్‌ ఇస్మార్ట్‌ శంకర్‌. బాగా ఎక్కేశాడు.
మీ ఎనర్జీ రహస్యం ఏంటి?.. ఫ్యాన్స్‌ కాకుండా..
రామ్‌: సమాధానం ఇచ్చి.. చెప్పొద్దు అంటే ఎలా తమ్మి.. ఫ్యాన్సే.
మీకు నేను వీరాభిమానిని. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ను తొలిరోజు, తొలి షో చూడబోతున్నా. మీ తర్వాతి ప్రాజెక్టు ఏంటి?
రామ్‌: అన్నీ కుదిరిన తర్వాత ప్రకటిస్తా.
పెళ్లి ఎప్పుడు సోదరా?
రామ్‌: అస్సల్‌ తెల్వద్‌.
హిట్స్‌, ఫ్లాప్స్‌ను ఎలా సమన్వయం చేస్తారు?
రామ్‌: చేయలేం.. అదే లైఫ్‌ మనకిచ్చే కిక్‌.
‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సీక్వెల్‌ను ఆశించొచ్చా?
రామ్‌: అది రేపు మీ చేతుల్లో ఉంది తమ్మి.. ఆ ప్రశ్న మిమ్మల్ని నేను అడగాలి.
‘ఇస్మార్ట్‌ శంకర్‌’ క్యారెక్టర్‌ కొంచెం రామ్‌లో ఉందని పూరీ అన్నారు. ఎంత శాంత ఉండొచ్చు?
రామ్‌: లోపల ఎక్కడో ఉన్నాడనుకుంటా.
అన్నా.. నువ్వు రిప్లై ఇవ్వకపోతే చచ్చిపోయేలా ఉన్నా.
రామ్‌: నీ కోసం సినిమానే చేసినా.. రిప్లై ఓ లెక్కా.

మాస్‌ హీరో అవుతావని ఊహించావా?
రామ్‌: మరీ అంత కొత్తేం కాదులే తమ్మి. ఎంట్రీ ఇచ్చిందే వీటితో.
రేపు వరుసగా మూడు షోలు చూడబోతున్నా.
రామ్‌: వావ్‌.. లాట్స్‌ ఆఫ్‌ లవ్‌.
నిధి అగర్వాల్‌ గురించి ఒక్కమాట? (నిధి అగర్వాల్‌ స్వయంగా ట్వీట్‌ చేశారు)
రామ్‌: అది కుదరని పని.. నీలాంటి అద్భుతమైన వ్యక్తిని ఒక్కమాటలో వర్ణించడం కష్టం.
వడ్డీతో తిరిగి ఇచ్చేస్తా అన్నావ్‌. ఈ సినిమా ఇస్తుందా?
రామ్‌: వడ్డీ ఎంతలే. మీ కోసం జీవితం మొత్తం ఇస్తూనే ఉన్నా తమ్మి. నాకు అదో కిక్కు.
సత్యదేవ్‌ పాత్ర ఎలా ఉండబోతోంది? (స్వయంగా నటుడు సత్యదేవ్‌ ట్వీట్‌ చేశారు)
రామ్‌: అద్భుతంగా నటించారు. రేపటికి గుడ్‌ లక్‌.
ఇకపై ఇలాంటి మాస్‌, కిక్‌ ఇచ్చే పాత్రల్ని ఆశించొచ్చా?
రామ్‌: బ్యాలెన్స్‌ చేసుకోవాలి. కానీ తప్పకుండా.
రేపు నాన్నతో సినిమాకి వెళ్తున్నా. ఫర్వాలేదా?
రామ్‌: మీ నాన్నతో స్నేహంగా ఉంటే కలిసి చూడండి. లేదు కాస్త బయం ఉంటే విడివిడిగా చూడండి. ఇంకేం చెబుతాం.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.