close
ఇంటర్వ్యూ
అనసూయ.. కాలేజీలో ఎవర్నైనా ప్రేమించారా?

చిత్ర పరిశ్రమకు రాకపోయుంటే ఏం చేసేవారు?

ఫ్యాన్స్‌తో యాంకర్‌ చిట్‌చాట్‌

హైదరాబాద్‌: యాంకర్‌గా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన అనసూయ నటిగానూ సందడి చేస్తున్నారు. ఆగస్టు 9న ఆమె నటించిన ‘కథనం’ సినిమా విడుదల కాబోతోంది. ఎన్‌. రాజేశ్ దర్శకత్వం వహించారు. అవసరాల శ్రీనివాస్‌, ధనరాజ్‌, వెన్నెల కిశోర్‌ కీలక పాత్రలు పోషించారు. సునీల్ కశ్యప్‌ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా ట్రైలర్‌ను శనివారం విడుదల చేశారు. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా అనసూయ ట్విటర్‌ వేదికగా అభిమానులతో మాట్లాడారు. ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆ విశేషాలివి..  
* ‘కథనం’లో పాటలు ఉన్నాయా?
అనసూయ: ‘చీకటి కొండల్లో..’ అనే ఒక్కపాట మాత్రం ఉంది.
* ‘కథనం’ సినిమాలో నటించడం ఎలా అనిపించింది?
అనసూయ: ఈ ప్రయాణం నాకు ఎన్నో నేర్పింది. నన్ను ఇంకా బాధ్యతగల వ్యక్తిగా తయారు చేసింది. నా తొలి ‘సోలో పోస్టర్‌’ సినిమా.
* ఈ సినిమాలో మీ పేరు?
అనసూయ: అను.
* మీరు మళ్లీ ‘బ్లాక్‌బస్టర్‌’, ‘జాక్‌పాట్‌’ లాంటి షోలు చేస్తారా? వాటిని మిస్‌ అవుతున్నాం.
అనసూయ: వావ్‌.. వీలైనంత త్వరలోనే కొత్త షోలో నటించేందుకు ప్రయత్నిస్తా.

* అనసూయ నేను మీ నటనకు పెద్ద అభిమానిని. ఇలాగే మంచి సినిమాలు తీస్తావని ఆశిస్తున్నా.
అనసూయ: చాలా చాలా ధన్యవాదాలు.
* సోలో హెచ్‌డీ ఫొటోలు షేర్‌ చేయండి?
అనసూయ: త్వరలోనే..
* చిత్ర పరిశ్రమకు రాకపోయి ఉంటే ఏం చేసేవారు?
అనసూయ: చక్కగా ఇంట్లో కూర్చుని వ్యవసాయం చేసేదాన్ని.
* తిన్నావా రా?
అనసూయ:నాకొద్దు. (నవ్వుతున్న ఎమోజీలు)
* మీ తర్వాతి తెలుగు సినిమా ఏది?
అనసూయ: ముందు ‘కథనం’ చూస్తున్నారా? ఆ విషయం చెప్పండి. ఆ తర్వాత మీకు జవాబు చెబుతాను.
* మీరు మీ దుస్తుల్ని ఎలా ఎంచుకుంటారు? చాలా బాగుంటాయి. మిమ్మల్ని మెచ్చుకోవడానికి మాటలు సరిపోవు. ఇలానే ఆకట్టుకుంటూ ఉండండి.
అనసూయ: హాహాహా.. ధన్యవాదాలు.

* మిమ్మల్ని విజయ నిర్మలలాంటి గొప్ప దర్శకురాలిగా ఊహించుకోవచ్చా?భవిష్యత్తులో సినిమాలు తీసే అవకాశం ఉందా?
అనసూయ: అయ్యోబాబోయ్‌.. చెప్పడం సులభమే.. చేయడమే కష్టం.
* సెట్‌లో బాగా కష్టపడ్డ తర్వాత ఎలా రిలాక్స్‌ అవుతారు?
అనసూయ: ఇంటికొచ్చి నా కుటుంబంతో గడుపుతా. కేవలం గంటసేపు వారితో ఉన్నా చాలు.. ఒత్తిడి తగ్గిపోతుంది.
* మీరు చేసిన సినిమాలు చూసి గర్వపడుతుంటాం. మీ భర్త చాలా అదృష్టవంతుడు. నాకు మీలాంటి భార్య రావాలని కోరుకుంటున్నా.
అనసూయ: చాలా దయతో మాట్లాడారు. ధన్యవాదాలు. నాలాంటి భార్య కావాలన్నారు.. ఆల్‌ ది బెస్ట్ (నవ్వుతున్న ఎమోజీలు)‌.
* ‘కథనం’ తర్వాత కొత్త ప్రాజెక్టుకు సంతకం చేశారా?
అనసూయ: ‘కథనం’ షూటింగ్‌ జరుగుతుండగానే మరో సినిమాలో నటించా. అది కూడా దాదాపు పూర్తయింది. దాని గురించి త్వరలోనే తెలుస్తుంది.
* కథానాయిక ప్రాధాన్యంగా వస్తున్న మీ తొలి సినిమా ఇది. ఎలా ఫీల్‌ అవుతున్నారు?
అనసూయ: కంగారుగా, ఉత్సుకతగా ఉంది.

* మీ జీవితం గురించి ఒక్కమాటలో చెప్పండి?
అనసూయ: సంతృప్తికరంగా ఉంది.
* మీ భర్తపై కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు?
అనసూయ: సింపుల్‌.. ఫైట్‌ చేస్తా.
* ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు?
అనసూయ: ఇంట్లో.

* అనసూయ బాగా స్లిమ్‌ అయిపోయారు. రామ్‌ చరణ్‌ తర్వాతి సినిమాలో సోదరి పాత్రలో నటిస్తున్నారా? (సరదాగా)
అనసూయ: నవ్వుతూ సిగ్గుపడుతున్న ఎమోజీలు.
* ‘కథనం’లో మీకు నచ్చిన సీన్‌ ఏది?
అనసూయ: అలా చెప్పడం కష్టం.
లవ్‌ యూ లాట్స్‌..
అనసూయ:లవ్‌ యూ లాట్స్‌ టూ.
* మీ చేతిపై ఉన్న టాటూ శాశ్వతమైందా?
అనసూయ: అవును.
* చిత్ర పరిశ్రమలోకి ఎందుకు వచ్చాను? అని ఎప్పుడైనా బాధపడ్డారా?
అనసూయ: లేదనుకుంటా.

* మీకు మార్వెల్‌, డిస్నీ.. మీకు ఇష్టమైనంది ఏది?
అనసూయ: ఎప్పటికీ మార్వెలే.
* విమర్శల్ని ఎలా తీసుకుంటారు?
అనసూయ: పట్టించుకోను.
* ‘కథనం’లో ఎలా ఉండబోతోంది. అనసూయ నుంచి యాక్షన్‌, గ్లామర్‌.. ఏది ఆశించొచ్చు?
అనసూయ: మీ అంచనాలను చేరుకుంటానో, లేదో అని భయంగా ఉంది. కానీ ‘అనసూయ బాగా నటించింది’ అని మీ దగ్గర అనిపించుకోవాలి.
* ఒక చెల్లిగా అడుగుతున్నా.. ఈ వ్యక్తిని అన్‌బ్లాక్‌ చేయండి. అతడు ఏడుస్తున్నాడు.
అనసూయ: సరే.. ఈ చెల్లి కోసం..
*  నేను మీ ఫ్యాన్‌. ఈ వీడియో చూడండి. మీ పుట్టినరోజు సందర్భంగా నేను తయారు చేశా. కానీ మీరు చూడలేదు.
అనసూయ: వావ్‌.. ఇప్పుడే చూశా. చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.
* ఇటీవల వచ్చిన సినిమాల్లో మీకు నచ్చింది?
అనసూయ: ‘ఆర్టికల్‌ 15’.

* మీ పిల్లలపై ఎప్పుడైనా చేయి చేసుకున్నారా?
అనసూయ: సీరియస్‌గా ఎప్పుడూ కొట్టలేదు. అప్పుడప్పుడూ రెండు తగిలిస్తుంటా.
* ‘కథనం’, ‘మన్మథుడు 2’ ఒకేరోజు విడుదల కాబోతున్నాయి. నాగ్‌తో పోటీ పడుతున్నారు. ఎలా ఫీల్‌ అవుతున్నారు?
అనసూయ: పోటీ అనే పెద్ద పదం ఎందుకండి. ఉత్సుకతగా ఫీల్‌ అవుతున్నా
* మీ టీంతో కలిసి ‘కథనం’ సినిమా చూసే అవకాశం కల్పిస్తారా?
అనసూయ:చూద్దాం.. నా వల్ల ఏది సాధ్యం అవుతుందో.
* మీ అసలు పేరు ఏది?
అనసూయ: అదేంటి అలా అడిగారు. పెళ్లికి ముందు అనసూయ కస్బా. పెళ్లి తర్వాత అనసూయ భరద్వాజ్‌.
* బాలీవుడ్‌లో నటిస్తారా?
అనసూయ: ముందు ఇంట గెలవనియ్యండి.
* ‘జబర్దస్త్‌’, ‘extra జబర్దస్త్’.. మీకు ఇష్టమైన షో ఏంటి?
అనసూయ: అదేమి ప్రశ్నండీ బాబు.

* తెలుగులో మీరు చూసిన లేటెస్ట్‌ మూవీ?
అనసూయ: ‘మహర్షి’.. నా చివరి సినిమా. మన తెలుగు సినిమాలు చాలా చూడాలి.
* విమర్శల్ని పాజిటీవ్‌గా తీసుకుంటారా? నెగిటీవ్‌గా తీసుకుంటారా?
అనసూయ: లైట్‌ తీసుకుంటా.
* తమిళ సినిమాల్లో నటించే అవకాశం ఉందా?
అనసూయ: నటించడం ఇష్టమే. సరైన కథ కోసం చూస్తున్నా.
* చిన్నప్పుడు మీకు ఇష్టమైన హీరో ఎవరు?
అనసూయ: యాక్టింగ్‌ కింగ్‌ అర్జున్‌, కింగ్‌ నాగార్జున అంటే ఇష్టం. అనిల్‌ కపూర్‌, రిచార్డ్‌ గేర్‌ కూడా.
* మీకు ఇష్టమైన ఆహారం ఏంటి?
అనసూయ: పరిస్థితినిబట్టి మారుతూ ఉంటుంది. కానీ అమ్మా, అత్త వంటలు ఎప్పుడూ నచ్చుతాయి.
* పాఠశాలలో, కళాశాలలో చదువుతున్నప్పుడు ఎవర్నైనా ప్రేమించారా?
అనసూయ: నేను ప్రేమించిన ఒకేఒక్క వ్యక్తినే పెళ్లి చేసుకున్నాను.
* మిమ్మల్ని హీరోయిన్‌గా చూడాలి అనుకుంటున్నా. అవకాశం వస్తే ఒప్పుకుంటారా?
అనసూయ: ‘కథనం’ సినిమా చూడండి. నేను ఫుల్‌ రోల్‌ చేయడం మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా.
* మీ కోసం పాట పాడుతున్నా.. ‘సొగసు చూడతరమా. అనసూయ చెంత చేరుతుంటే ప్రేమా. ఇంక చాలు సిగ్గేస్తోంది’.
అనసూయ: అయ్యో. సిగ్గుపడాల్సింది నేను కదా.

 


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.