close
ఇంటర్వ్యూ
రాజమౌళి దర్శకత్వంలో అవకాశం వస్తే..!

ఇంటర్నెట్‌డెస్క్‌: నటుడిగా, రచయితగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అడవిశేష్‌. ఆయన కీలక పాత్రలో నటించిన చిత్రం ‘ఎవరు’. రెజీనా, నవీన్‌ చంద్ర కీలక పాత్రలు పోషించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా అడవిశేష్‌ ట్విటర్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. 

మీ తర్వాతి చిత్రం ఎప్పుడు అన్నా?
అడవి శేష్‌: వచ్చే ఏడాది వస్తుంది. త్వరలోనే ‘మేజర్‌’ను ప్రారంభిస్తాం.

భయ్యా ‘గూఢచారి2’ ఎప్పుడు?
అడవి శేష్‌: ‘మేజర్‌’ అయిపోగానే మొదలు పెడతాం. 

తెలుగు  చిత్ర పరిశ్రమలో మీ అభిమాన నటుడు ఎవరు?
అడవి శేష్‌: ఆ హీరో ఎవరో నాకూ తెలియదు. కానీ, చరిత్రలో ఎప్పటికీ  ఉత్తమ నటుడు ఎస్వీఆర్‌

మీరు ఎందుకు ఒకే జోనర్‌లో సినిమాలు చేస్తున్నారు?
అడవి శేష్‌: అది నిజం కాదు. ‘అమీతుమీ’ కామెడీ, ‘గూఢచారి’ యాక్షన్‌, ‘ఎవరు’, ‘క్షణం’ థ్రిల్లర్‌ మూవీలు

హిందీ చిత్ర పరిశ్రమలోకి ఎప్పుడు వెళ్తారు?
అడవి శేష్‌: ‘మేజర్‌’ సినిమాను హిందీలోనూ విడుదల చేస్తాం. 

‘గూఢచారి’ క్లైమాక్స్‌లో మీరు చూపించిన ప్రాంతం ఏది?
అడవి శేష్‌: లీవెన్‌వర్త్‌, మెట్‌రెయినర్‌

నాగార్జునగారితో సినిమా ఎప్పుడు చేస్తారు? అభిమానులం వేచి చూస్తున్నాం?
అడవి శేష్‌: ఆయన ఎప్పుడు అవకాశం ఇస్తే, అప్పుడు చేస్తా. 

మీ నుంచి రొమాన్స్‌-కామెడీ సినిమా వస్తుందా? ‘ఏజెంట్‌’గా చూసి బోర్‌కొట్టేసింది?
అడవి శేష్‌: అయితే ‘మేజర్‌’లో ఎన్‌ఎస్‌జీ కమాండోగా చూడండి. 

రాజమౌళి సర్‌ దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం వస్తే?
అడవి శేష్‌: నా జీవితంలో అతిపెద్ద కల నిజమైనట్లు భావిస్తా. 

ఒక సినిమాను అడాప్ట్‌ చేసుకోవడం లేదా కాపీ చేయడం రెండింటి మధ్య భేదం ఏంటి?
అడవి శేష్‌: అడాప్టేషన్‌: ఒక కథ రైట్స్‌ కొని, దానిలోని సోల్‌ను తీసుకుని కొత్త కథ అల్లడం- ఇది ‘ఎవరు’
రీమేక్‌: ఒక కథ రైట్స్‌ తీసుకొని ఇంచుమించుగా సేమ్‌ టు సేమ్‌ మళ్లీ తీయడం -బద్లా
కాపీ: రైట్స్‌ తీసుకోకుండా దొంగిలించడం. లేపడం. కొట్టేయడం.

మీ కలల ప్రాజెక్టు ఏంటి?
అడవి శేష్‌: మహాభారతం

‘మేజర్‌’లో మహేశ్‌బాబు ఏదైనా రోల్‌ చేస్తున్నారా?
అడవి శేష్‌: చేయడం లేదు. 

బాలీవుడ్‌లో మీ అభిమాన కథానాయిక ఎవరు?
అడవి శేష్‌: ఎప్పటికీ నా అభిమాన కథానాయిక మధుబాల

మీరు హీరో కాకపోయి ఉంటే ఏ జాబ్‌ చేసేవారు?
అడవి శేష్‌: రచయిత

చిరంజీవి, పవన్‌కల్యాణ్‌ కోసం మీ దగ్గర కథ ఉందా?
అడవి శేష్‌: లేదండీ. ప్రస్తుతానికి ‘ఎవరు’ విజయాన్ని ఆస్వాదిస్తున్నాం. 

‘మేజర్‌’ మూవీకి మహేశ్‌ ప్రొడ్యూస్‌ చేయడానికి కారణం?
అడవి శేష్‌:: నా అదృష్టం. 

కుటుంబ కథా చిత్రాలు చేయాలని మీకు ఉందా? ఎందుకంటే ‘ఎవరు’లో ఎమోషనల్‌ సీన్లు అద్భుతంగా ఉన్నాయి. కుటుంబ ప్రేక్షకులు కూడా సులభంగా మీకు దగ్గరవుతారు కదా!
అడవి శేష్‌: నాకూ ఫ్యామిలీ సినిమా చేయాలని ఉంది. అయితే, ఆ సబ్జెక్ట్‌లను హ్యాండిల్‌ చేయడం చాలా కష్టం. 

విజయ దేవరకొండపై మీ అభిప్రాయం ఏంటి?
అడవి శేష్‌: చాలా మంచోడు

ప్రభాస్‌ అన్న కోసం ఏదైనా స్క్రిప్ట్‌ రాశారా?
అడవి శేష్‌: లేదండీ. ప్రస్తుతానికి ‘మేజర్‌’ రాస్తున్నా. 

అవకాశం వస్తే, మహేశ్‌బాబుని డైరెక్ట్‌ చేస్తారా? లేదా ఆయన సినిమాకు స్క్రిప్ట్‌ రాస్తారా?
అడవి శేష్‌: ప్రస్తుతానికి ఆయనే నాకు ఛాన్స్‌ ఇచ్చారు. 

సమంత గురించి ఒక్క మాటలో చెప్పండి
అడవి శేష్‌: నెం.1

హాలీవుడ్‌, బాలీవుడ్‌ స్టైల్‌లో సిరిస్‌ చిత్రాలు ప్లాన్‌ చేయొచ్చు కదా!
అడవి శేష్‌: ‘మేజర్‌’ తర్వాత ‘గూఢచారి2’ తప్పకుండా తీస్తా. 

మీరు అంత తెల్లగా ఉండటానికి కారణం? ఫెయిర్‌ అండ్‌ లవ్లీ వాడతారా?
అడవి శేష్‌: మా అమ్మ. 

రామ్‌చరణ్‌ గురించి ఒక్క మాటలో చెప్పండి?
అడవి శేష్‌: ‘రంగస్థలం’లో ఆయన నటన ఈ దశాబ్దానికే హైలైట్‌. 

ప్రభాస్‌ గురించి ఒక్క మాటలో చెప్పండి?
అడవి శేష్‌: ఒక మాట సరిపోదు బ్రదర్‌

‘2స్టేట్స్‌’ రీమేక్‌ ఆగిపోయిందా?
అడవి శేష్‌: అవును ఆగిపోయింది.

మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసిన ఫిలిం మేకర్‌ ఎవరు?
అడవి శేష్‌: నోలాన్‌, విఠలాచార్య, ఎల్వీ ప్రసాద్‌, ఫించెర్‌, కురుసోవా, గురు దత్త


ఇటీవల కాలంలో మీరు బాగా ఇష్టపడిన చిత్రాలు?
అడవి శేష్‌: ఓ బేబీ, జెర్సీ, బ్రోచేవరెవరురా.. మల్లేశం

మీలో మీకు నచ్చింది ఏంటి?
అడవి శేష్‌: నిద్రలేకుండా కూడా పనిచేస్తా. 

బాలీవుడ్‌లో మీ క్రష్‌ ఎవరు?
అడవి శేష్‌: లీసా హేడెన్‌

మహేశ్‌బాబు నటించిన ఏ సినిమా మీ ఫెవరెట్‌
అడవి శేష్‌: మురారి, ఒక్కడు, అతడు. కానీ, ఖలేజాలో ఆయన నటన అంటే చాలా ఇష్టం. 

పవన్‌కల్యాణ్‌ సినిమాల్లో మీకు నచ్చింది ఏంటి?
అడవి శేష్‌: తొలి ప్రేమ


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.