close
ఇంటర్వ్యూ
ఆర్య ముందు సాయేషాతో రొమాన్స్‌: ఇబ్బందిపడ్డా

ఆయనతో నటన.. కల నిజమైంది: సూర్య

హైదరాబాద్‌: తన సినీ కెరీర్‌లో చాలా రోజుల తర్వాత ‘బందోబస్త్‌’లాంటి పెద్ద ప్రాజెక్టులో చేశానని తమిళ స్టార్‌ సూర్య అన్నారు. కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ మార్కెట్‌ ఏర్పరచుకున్న ఆయన నటించిన సినిమా ఇది. ఇందులో ఆయన వివిధ గెటప్‌లలో కనిపించనున్నారు. దర్శకుడు కె.వి.ఆనంద్‌ సినిమాను తెరకెక్కించారు. సాయేషా సైగల్‌ కథానాయిక. సుభాస్కరన్‌ నిర్మాత. తెలుగులో ఎన్వీ ప్రసాద్‌ విడుదల చేస్తున్నారు. సెప్టెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రచారంలో భాగంగా సూర్య ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలివి..

పరిశోధనలు చేశారు
‘‘చాలా రోజుల తర్వాత నేను చేసిన పెద్ద ప్రాజెక్టు ఇది. లైకా వల్ల ఇది సాధ్యమైంది, అందుకు థాంక్స్‌ చెప్పాలి. కె.వి ఆనంద్‌తో చాలా ఏళ్లుగా ప్రయాణిస్తున్నా. 1997లో నా తొలి సినిమాకు ఆయన సినిమాటోగ్రాఫర్‌గా చేశారు. ఆయన ఫొటో జర్నలిస్ట్‌ కూడా. ఆయన దగ్గర ఆసక్తికరమైన అనేక సంఘటనలు, కథలు ఉన్నాయి. అన్నీ సేకరించి చేసి, పెట్టుకున్నారు. ఈ సినిమా కథ కోసం చాలా పరిశోధనలు చేశారు’’

చెన్నైవాసిగా చూడటం వేరు..
‘‘ఓ ప్రధాని కార్యాలయంలో ఏం జరుగుతుంది? సమాజంలోని పరిస్థితులు, సెక్యూరిటీ విషయంలో మనం ఎలా ఉన్నాం.. తదితర విషయాల్ని ఇందులో ప్రస్తావించాం. మన భద్రతా సిబ్బంది జీతాలు తీసుకుని, తమ జీవితాల్ని ప్రమాదంలో ఉంచుతుంటారు. వారిని మనం గౌరవించాలి. మనకు తెలియని చాలా పనులు వారు చేస్తుంటారు. వాటిని అధికారికంగా బయటపెట్టరు. అలాంటి పాత్రలో నేను నటించడం సంతోషంగా ఉంది. ఇందులో నటించడం చక్కటి అనుభవం. వ్యక్తి గతంగా చెన్నైలో కూర్చుని భారత్‌ను చూడటం వేరు, ఓ అధికారిగా భారత్‌ను చూడటం వేరు. ఈ సినిమా వల్ల నేను భారత్‌ను మరో కోణంలో చూడగలిగా’’

ప్రతి పాత్ర ముఖ్యం
‘‘దిల్లీలో కథ సాగుతుంది. పై అధికారుల జీవితాల్ని ఇందులో చూడబోతున్నారు. మోహన్‌లాల్‌ లాంటి  గొప్ప నటుడితో కలిసి పనిచేయడం నా కల అది నెరవేరింది. ఆయన కెమెరా ముందు నిల్చుంటే మిగిలిన ప్రపంచాన్ని మరిచిపోతారు. ఆయన్నుంచి చాలా నేర్చుకున్నా. ఈ చిత్రంలోని ప్రతి పాత్రకు ప్రాముఖ్యం ఉంది. అది చిత్రానికి మరింత బలం కాబోతోంది’’

నిబంధనలు లేవు
‘‘ఈ చిత్రంలో నేను చాలా లుక్స్‌లో కనిపిస్తా. నిర్మాణ సంస్థ లైకా ఎటువంటి నిబంధనలు పెట్టదు. పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. ‘బందోబస్త్‌’ కేవలం ఓ సినిమా కాదు.. మనకు దేశం, భద్రత గురించి అవగాహన కల్పిస్తుంది. మన సిబ్బంది కుటుంబానికి దూరంగా ఉండి, విధులు నిర్వర్తిస్తుంటారు. ఆ భావోద్వేగాల్ని కూడా చూపించాం’’
ఇబ్బందిపడ్డా
‘సాయేషా సైగల్‌ మంచి నటి. ఆమె ముంబయి నుంచి వచ్చినా.. మరో భాష నేర్చుకుని నటిస్తున్నారు. ఇందులో ఆమె పాత్ర కేవలం ఓ హీరోయిన్‌గా మాత్రమే కాదు.. కథను మలుపు తిప్పే పాత్ర అది. ఆర్యకు థాంక్స్‌ చెప్పాలి. నిజానికి ఈ సినిమాలో అల్లు శిరీష్‌ నటించాల్సి ఉంది. కానీ, చివరి నిమిషంలో కొన్ని సమస్యలు రావడం వల్ల ఆర్యను తీసుకున్నాం. ఆర్య అద్భుతంగా నటించాడు. ఆర్యను పక్కన పెట్టుకుని సాయేషాతో రొమాన్స్‌ చేయాలంటే ఇబ్బందిపడ్డా’’

సైరాకు ఆల్‌ది బెస్ట్‌
‘‘అక్టోబరు 2న రాబోతున్న ‘సైరా’ చిత్ర బృందానికి నా ఆల్‌ ది బెస్ట్‌. రామ్‌ చరణ్‌ చాలా గొప్పగా ఆ సినిమాను తీస్తున్నారు. నాకు ఇష్టమైన దర్శకుడు విక్రమ్‌ కె కుమార్‌. ఆయన సినిమా ‘గ్యాంగ్‌లీడర్‌’ ఇవాళ వచ్చింది. నా బెస్ట్‌ విషెస్‌ చెబుతున్నా’’

 

 



Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.