close
ఇంటర్వ్యూ
పవన్‌కల్యాణ్‌తో సినిమా తప్పక చేస్తా!

‘వాల్మీకి’లో వరుణ్‌తేజ్‌ నట విశ్వరూపం చూస్తారని అన్నారు హరీష్‌ శంకర్‌. ఆయన దర్శకత్వం వహించిన చిత్రమిది. పూజాహెగ్డే కథానాయిక. అధర్వ కీలక పాత్రలో నటిస్తున్నారు. 14రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంటలు నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హరీష్‌శంకర్‌ విలేకరులతో మాట్లాడారు. 

ఒక సినిమా అనుకుంటే మరొక సినిమా!
‘‘నేనూ వరుణ్‌ కలిసి అసలు ఈ సినిమా చేద్దామని అనుకోలేదు. ‘దాగుడు మూతలు’ స్క్రిప్ట్‌ రాసుకుని దాన్ని వరుణ్‌తో తీద్దామని వెళ్లి కలిశా. ‘ఈ కథ నాతోనే ఎందుకు చేయాలి’ అని వరుణ్‌ అడిగాడు. 
‘తొలిప్రేమ, ఫిదా వంటి ప్రేమకథా చిత్రాలు చేశావు కదా. నాకూ కొత్తగా ఉంటుందనే ఉద్దేశంతో వచ్చా’ అని అన్నాను. ‘మీతో మీశైలి సినిమాలు చేస్తాను’ అని అనడంతో దాన్ని పక్కన పెట్టాం. అదే సమయంలో కార్తీక్‌ సుబ్బరాజు ‘పేట’ ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. ఆయన సినిమాలు బాగుంటాయని కదాని ‘జిగర్తాండ’ చూశా. అది బాగా నచ్చడంతో రీమేక్‌ చేశాం. 

గబ్బర్‌సింగ్‌కు చేసినన్ని మార్పులు చేయలేదు!
‘‘దబాంగ్’ సినిమాను ‘గబ్బర్‌సింగ్’గా చేసినన్ని మార్పులు ఈ సినిమాలో చేయలేదు. ఎందుకంటే ‘జిగర్తాండ’నే బ్యూటిఫుల్‌ కంటెంట్‌. ఆ స్క్రీన్‌ప్లే ప్లే, కంటెంట్‌ అంటేనే నాకు చాలా ఇష్టం. నేటివిటీకి సంబంధించి చిన్న చిన్న మార్పులు చేశా. అలాగే అక్కడ బాబీ సింహా చేసిన క్యారెక్టర్‌ను వరుణ్‌ క్యారక్టరైజేషన్‌కి సరిపోయేటట్లు కొన్ని మార్పులు చేయడం జరిగింది’’

అందుకే ‘వాల్మీకి’ టైటిల్‌
‘‘ఒక మనిషి అత్యున్నతమైన మార్పుకి ‘వాల్మీకి మహర్షి’ గొప్ప నిదర్శనం. ఆయన అందరికీ స్ఫూర్తి‌. ఈ సినిమాలో వరుణ్‌ క్యారెక్టర్‌ మార్పు అనేది హైలైట్‌గా ఉంటుంది. ఈ సినిమా కథే అది అవడంతో ఈ టైటిల్‌నే ఫిక్స్‌ చేశాం’’

పూజా హెగ్డే గురించి ఇప్పుడే చెప్పను
‘‘ఈ సినిమాలో పూజా హెగ్డే పాత్ర చాలా కీలకం. ద్వితీయార్థంలో వస్తుంది. ఆ ఒక్క క్యారెక్టర్‌ ఆడియన్స్‌కి సస్పెన్స్‌ ఇచ్చేలా ప్లాన్‌ చేశాం. అందుకే దాని ఇప్పుడే రివీల్‌ చేయడం లేదు. సినిమాలో చూసి ఎంజాయ్‌ చేయాల్సిందే’’

అందుకే ‘ఎల్లువొచ్చి గోదారమ్మ’ పాటను రీమిక్స్‌ చేశాం!
‘‘పూజా హెగ్డే క్యారెక్టరైజెషన్‌ కానీ, ఆ సాంగ్‌ కానీ కథ డిమాండ్‌ మేరకే పెట్టాం.. తప్ప ఏదో కమర్షియల్‌గా ఒక రీమిక్స్‌ పాట పెట్టాలని కాదు. అలా అనుకుంటే చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌ గారి పాటలు బోలెడు ఉన్నాయి. అలాగే ఈ సినిమాలో నాలుగు పాటలు ఉన్నాయి. యాక్షన్‌ ఎపిసోడ్స్‌ తక్కువ ఉంటాయి. అయినా నా అన్ని సినిమాల కంటే ఎక్కువ లెంగ్త్‌తో వస్తోందంటే కంటెంట్‌ ఎక్కువగా ఉండబోతుంది’’

అధర్వని అందుకే తీసుకున్నాం!
‘‘తెలుగులో కూడా చాలా మంది ప్రతిభ ఉన్న నటులు  ఉన్నారు. మేం కూడా కొంతమందిని ఆడిషన్‌ చేశాం. కానీ, సినిమాలో ఒక ఫైర్‌ ఉన్న డైరెక్టర్‌లా కనిపించాలి. అలాగే మంచి యాక్టర్‌ అయ్యి ఉండాలి అనుకున్నపుడు అధర్వని చూసి సెలక్ట్‌ చేశాం’’

వాళ్లకు సినిమా అంటే ఎంతో గౌరవం
‘‘రామ్‌ ఆచంటగారు, గోపి ఆచంటగారు ‘నమో వేంకటేశ’ చేయకముందు నుంచి నాకు పరిచయం. చాలా ప్యాషనేట్‌ ప్రొడ్యూసర్స్‌. ఈ 14 రీల్స్‌ ప్లస్‌ బేనర్‌ నా సినిమాతో స్టార్ట్‌ అవడం సంతోషంగా ఉంది. ఇక మిక్కీ జే మేయర్‌ కూడా అద్భుతమైన పాటలు ఇచ్చాడు.’’

పవన్‌తో సినిమా తప్పకుండా జరుగుతుంది
‘‘ఫ్యాన్స్‌తో పాటు మీరు కూడా సినిమా త్వరగా జరగాలని కోరుకోండి. తప్పకుండా జరుగుతుంది. నేను కూడా పవన్‌ కళ్యాణ్‌గారితో సినిమా ఎప్పుడెప్పుడు చేయాలా? అని వేచి చూస్తున్నా. వారం క్రితం ఆయనను కలిసి ట్రైలర్‌ చూపించాను. ‘చాలా బాగుంది హరీష్‌’ అన్నారు’’

సుకుమార్‌ అతిథి పాత్రలో మెరుస్తారు
‘‘ఈ సినిమాలో బ్రహ్మానందంగారు చిన్న క్యారెక్టర్‌ చేశారు. అలాగే సుకుమార్‌ గారు కూడా అతిథి పాత్రలో మెరుస్తారు. సత్య మరోసారి ఫ్రెండ్‌ క్యారెక్టర్‌లో బాగా చేశాడు. మరో స్నేహితుడిగా ‘ఛాయ్‌ బిస్కెట్‌’ అరుణ్‌ చేశారు. వరుణ్‌ డెడికేషన్‌, కమిట్‌ మెంట్‌ షూటింగ్‌ టైమ్‌లో చూశా. 85 రోజులు షూట్‌ చేస్తే 85 రోజులు నవ్వుతూ చేసిన నా మొదటి హీరో వరుణ్‌’’

అన్ని సినిమాలు రీమేక్‌లే!
‘‘నేను 2012 తరువాత మళ్ళీ ఇప్పుడే రీమేక్‌ చేస్తున్నా. నా దృష్టిలో అన్ని సినిమాలు రీమేక్‌లే. ఒక సినిమాకి ఒక పుస్తకం, ఒక నవల, ఒక వ్యక్తి, స్ఫూర్తి అయినప్పుడు ఒక సినిమాకు ఇంకో సినిమా ఎందుకు స్ఫూర్తి కాకూడదనేది నా భావన. ఒక సినిమా ప్రేమికుడిగా నాకు నచ్చిన ఏ సినిమా నైనా రీమేక్‌ చేస్తాను’’

వరుణ్‌ నట విశ్వరూపం చూస్తారు!
‘‘వరుణ్‌ ఫ్యాన్స్‌కి, మెగా ఫ్యాన్స్‌కి నేను చెప్పేది ఏంటంటే.. సెప్టెంబర్‌ 20న ‘వాల్మీకి’లో వరుణ్‌ నట విశ్వరూపం చూస్తారు. ముఖ్యంగా ఇంటర్వెల్‌, క్లైమాక్స్‌లో నేను ఊహించుకున్న దానికంటే అద్భుతంగా చేశాడు’’ అని చెప్పుకొచ్చారు.

 

 



Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.