close
ఇంటర్వ్యూ
తెలుగులో గ్యాప్‌ రావడానికి కారణమదే:హన్సిక

ప్రేక్షకుల‌కి వినోదం పంచ‌డ‌మే నా ప‌ని. ఆ అవ‌కాశం ఏ భాష నుంచి వ‌చ్చినా స్వీక‌రిస్తా. తెలుగు, త‌మిళ భాష‌లు నాకు రెండు క‌ళ్లులాంటివి. ఈ రెండు భాష‌ల్లో న‌టించ‌డాన్ని ఎంత‌గానో ఆస్వాదిస్తా అంటున్నారు నటి హ‌న్సిక‌. `దేశ‌ముదురు`తో ప్రయాణం ప్రారంభించిన ఈ ముంబై భామ ఆ త‌ర్వాత త‌మిళంలో బిజీ అయిపోయింది. కానీ తెలుగు చిత్ర ప‌రిశ్రమ‌ని మాత్రం మ‌రిచిపోలేదు. తెలుగు నుంచి వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ న‌టిస్తోంది. ‘గౌత‌మ్ నందా’ చిత్రం త‌ర్వాత హ‌న్సిక న‌టించిన తెలుగు చిత్రం ‘తెనాలి రామ‌కృష్ణ బి.ఎ, బి.ఎల్’. సందీప్‌కిష‌న్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ చిత్రాన్ని జి.నాగేశ్వర్‌రెడ్డి తెర‌కెక్కించారు. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వ‌స్తున్న సంద‌ర్భంగా హ‌న్సిక హైద‌రాబాద్‌లో విలేక‌ర్లతో ముచ్చటించారు. ఆ విష‌యాలివీ...

ఇందులో న్యాయ‌వాది పాత్రలో న‌టించారు క‌దా, మీకు లాయ‌ర్ స్నేహితులు ఎవ‌రైనా ఉన్నారా?

హన్సిక: ఒక‌రున్నారు. త‌ను మా సోద‌రుడికి స్నేహితుడు. నాక్కూడా సోద‌రుడే. ఎప్పుడు ఫోన్ చేసినా కోర్టు రూమ్‌లో ఉన్నానంటుంటాడు. ఈ సినిమా చేస్తున్నప్పుడు త‌న ప్రపంచం ఎలా ఉంటుందో ఊహించుకున్నా. అన్నట్టు నేను కూడా చిన్నప్పుడు న్యాయ‌వాదిని అవ్వాల‌నే అనుకొనేదాన్ని. ఏ విష‌యంలోనైనా స‌రే నేను బాగా వాదిస్తుంటాన‌న్నమాట (న‌వ్వుతూ). అందుకే ఇప్పటికీ న్యాయ‌వాదిని అయ్యుంటే ఎంత బాగుండేదో క‌దా అనిపిస్తుంటుంది.

సినిమాతో ఆ కోరిక కొంత‌వ‌ర‌కు నెర‌వేరింద‌న్నమాట‌?

హన్సిక: నేనేమీ సీరియ‌స్ లాయ‌ర్‌ని కాదులెండి. న‌వ్వించే చోటు మోటు లాయ‌ర్‌ని. తెనాలి పాత్రలో క‌నిపించే సందీప్‌కిష‌న్‌తో క‌లిసి చేసే సంద‌డి మంచి వినోదాన్ని పంచుతుంది.

ఈ సినిమా ఒప్పుకోవ‌డానికి ప్రధాన‌మైన ఓ కార‌ణం చెప్పండి?

హన్సిక: క‌థే. హాస్యభ‌రితంగా సాగే క‌థ‌లంటే స్వత‌హాగా నాకు ఇష్టం. ప్రేక్షకుడికి ఆహ్లాదాన్ని పంచాలి. ఈ మ‌ర్డర్ ఎవ‌రు చేశారు? దీనికి కార‌ణం ఏంటి? క‌థ త‌ర్వాత ఎలాంటి మ‌లుపు తిరుగుతుందో... ఇలా ఒక ప‌క్క సినిమా చూస్తూ మ‌రో ప‌క్క బుర్రకి ప‌నిపెట్టే సినిమా కాదిది. హాయిగా స‌ర‌దాగా చూస్తున్నంత‌సేపూ న‌వ్విస్తుంది. జి.నాగేశ్వర్‌రెడ్డితో ఇదివ‌ర‌కు ‘దేనికైనా రెడీ’ చేశాను క‌దా. అలా ఆద్యంతం వినోదాన్ని పంచుతుందీ సినిమా. నాగేశ్వర్‌రెడ్డి స‌ర్ తను అనుకున్న క‌థను వెండితెరపై చాలా బాగా చూపిస్తారు. త‌ప్పకుండా ప్రేక్షకుల్ని న‌వ్విస్తుంది.

తెలుగులో సినిమా సినిమాకీ మ‌ధ్య రెండేళ్లు విరామం వ‌స్తోంది. కార‌ణ‌మేమిటి?

హన్సిక: దాన్ని నేను గ‌మ‌నించ‌లేదు. మంచి అవ‌కాశం నాకు ముఖ్యం. మంచి క‌థ వచ్చిందంటే అది ఏ భాష‌లో అనేది ప‌ట్టించుకోను. కొన్ని సంద‌ర్భాల్లో తెలుగు నుంచి అవ‌కాశాలు వ‌చ్చినా త‌మిళంలో సినిమాల‌తో బిజీగా ఉండ‌టంతో చేయ‌లేక‌పోయాను. అంతే కానీ... ప్రత్యేకంగా విరామం తీసుకోవ‌డ‌మంటూ ఏమీ లేదు.

క‌థానాయిక‌గా సుదీర్ఘమైన ప్రయాణం చేశారు. యాభై సినిమాల మైలురాయిని అధిగ‌మించారు. వెన‌క్కి తిరిగి చూసుకుంటే ఏమ‌నిపిస్తోంది?

హన్సిక: ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. ఇన్ని సినిమాలు చేయాల‌ని కానీ, చేస్తాన‌ని కానీ నేను ముందు ఊహించలేదు. ఒక ప్రవాహంలా ప్రయాణం సాగిపోతోందంతే.  

వ్యతిరేక ఛాయ‌ల‌తో కూడిన పాత్రలొస్తే చేయ‌డానికి సిద్ధమేనా?

హన్సిక: అస్సలు ఆలోచించ‌ను. మ‌ల‌యాళంలో మోహ‌న్‌లాల్‌తో క‌లిసి ఒక సినిమా చేశా. అందులో నాది వ్యతిరేక ఛాయ‌లున్న పాత్రే. విల‌నిజంతో కూడిన పాత్రలంటే నాకు చాలా ఇష్టం. అవ‌కాశం వ‌చ్చిందంటే త‌ప్పకుండా చేస్తా.

ఈమ‌ధ్య బ‌రువు బాగా త‌గ్గిన‌ట్టున్నారు. ఇదివ‌ర‌క‌టితో పోలిస్తే మ‌రింత నాజూగ్గా క‌నిపిస్తున్నారు?

హన్సిక: ఐదేళ్లుగా ఫిట్‌నెస్ విష‌యంలో మ‌రింత శ్రద్ధ తీసుకుంటున్నా. నాజూగ్గా మార‌డం వెన‌క ర‌హస్యం స్వ్కాష్‌ ఆడ‌ట‌మే. స‌మ‌యం దొరికితే స్క్వాష్ ఆడుతుంటా. అది నా బ‌రువుని బాగా నియంత్రిస్తుంటుంది.

తెలుగులో కొత్తగా ఒప్పుకున్న సినిమాలేమైనా ఉన్నాయా?

హన్సిక: భాగ్‌మ‌తి ఫేమ్ జి.అశోక్ ద‌ర్శక‌త్వంలో వెబ్‌సిరీస్ చేస్తున్న అందులో నేటియువ‌తుల్ని ప్రతిబింబించే పాత్ర నాది. ఇంకో నాలుగైదు రోజులు మాత్రమే చిత్రీక‌ర‌ణ చేయాలి.  రాబోయే కాలమంతా వెబ్‌సిరీస్‌లదే. నేనైతే బాగా చూస్తుంటా. త‌ప్పకుండా ఈ వెబ్‌సిరీస్ ఆక‌ట్టుకుంటుంది.

ఈ మ‌ధ్య కొత్త కారు కొన్నట్టున్నారు?

హన్సిక: ధ‌న్‌తేర‌స్‌ని పుర‌స్కరించుకొని మా అమ్మ మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్ బ‌హుమానంగా ఇచ్చింది. అదంటే నాకు చాలా ఇష్టం.

 

 Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.