close
బాలీవుడ్

కంగనకు అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి మద్దతు

‘ఆమె విజయానికి సరైన నిర్వచనం చెప్పారు’

ముంబయి: అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పెమా ఖండూ బాలీవుడ్‌ కథానాయిక కంగనా రనౌత్‌కు మద్దతు తెలిపారు. ఆమె విజయానికి సరైన నిర్వచనం చెప్పారంటూ ట్వీట్‌ చేశారు. ఇటీవల కంగన ఓ మీడియా సమావేశంలో బాలీవుడ్‌ను విమర్శిస్తూ మాట్లాడారు. ‘మణికర్ణిక’ వివాదంలో తనకు ఎవరూ మద్దతు తెలపలేదని అన్నారు. నటి ఆలియా భట్‌పై కూడా మండిపడ్డారు. ఆమెను ‘మణికర్ణిక’ ప్రత్యేక స్క్రినింగ్‌కు ఆహ్వానించినా రాలేదని విమర్శించారు. ‘మీరు (బాలీవుడ్‌ ప్రముఖులు) పనిచేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు. అలా జీవితాన్ని ముందుకు సాగిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు, నిజమైన నాయకుడు బాధ్యతగా వ్యవహరించాలి. మీరంతా ఈ దేశంలో ఓ భాగం. దేశ ప్రజల కోసం ఏమీ చేయలేనప్పుడు మీ విజయానికి, హోదాకి అర్థం ఏమిటీ?’ అని కంగన అన్నారు.

కంగన ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియోను పెమా ఖండు రీట్వీట్ చేశారు. ‘విజయవంతం రాణించడం అంటే ఏంటో మిస్‌ కంగనా రనౌత్‌ జీ సరిగ్గా చెప్పారు. సామాజిక బాధ్యతల్ని తీసుకుని, ఓ నాయకుడిలా వ్యవహరించడమే విజయం’ అని ట్వీట్‌ చేశారు.

కంగన టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘మణికర్ణిక’. ఆమె, క్రిష్‌ సంయుక్తంగా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కమల్‌ జైన్‌ నిర్మాత. ఝాన్సీ లక్ష్మీబాయి జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం జనవరి 25న విడుదలై మంచి టాక్‌ అందుకొంది. ఈ సినిమా 70 శాతం దర్శకత్వ క్రెడిట్‌ను కంగన తీసుకోవడం, కొన్ని పాత్రల్ని ఎడిట్‌ చేయడం పై క్రిష్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. క్రిష్‌ తనను విమర్శించడం సరికాదని కంగన ఘాటుగా స్పందించారు. ఈ మేరకు తనకు ప్రముఖుల మద్దతు లేకపోవడంతో ఆమె బాలీవుడ్‌ను మీడియా కూడా విమర్శించారు.

Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.