close
బాలీవుడ్

రామరాజు ‘సీత’.. ఈ ఆలియా!

ఎంతోమంది స్టార్‌ల వారసులు వస్తుంటారు.. వెళుతుంటారు.. కానీ, తమను తాము నిరూపించుకునేది మాత్రం కొంతమందే. అలా నిరూపించుకున్నవాళ్లలో బాలీవుడ్‌ బ్యూటీ ఆలియా భట్‌ ఒకరు. ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ నుంచి ఇటీవల ‘గల్లీబాయ్‌’వరకూ ఆమె చేసిన పాత్రలన్నీ ప్రత్యేకం. అందుకే తక్కువ సమయంలోనే పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకుంది. వరుస సినిమాలతో బిజీగా ఉండే ఆలియా.. మరో భారీ ప్రాజెక్టుతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌లు కథానాయకులుగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఒక కథానాయికగా అవకాశం దక్కించుకుంది. నేడు ఆమె పుట్టిన రోజు.  26వ వసంతంలోకి అడుగుపెడుతున్న ఆలియా గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..

 మహేశ్‌ భట్‌, సోనీ రాజ్దాన్‌ల కుమార్తె ఆలియా. ముంబయిలో జన్మించారు. ఆలియా తల్లిదండ్రులు సినిమా రంగానికి చెందినవారే. తండ్రి మహేశ్‌ సినిమా నిర్మాతగా అందరికీ సుపరిచితులు. తల్లి సోని సినిమాలతో పాటు చాలా ధారావాహికల్లో నటించారు.
•  ఆలియా కంటే చిన్నదైన ఓ సోదరి ఉంది. ఆమె పేరు షహీన్‌. వాళ్ల నాన్న ఇద్దరినీ నాస్తికులుగా పెంచారట. ఇమ్రాన్‌ హష్మీ.. ఆలియాకు బంధువు అవుతాడు. ముంబయిలోని జామ్నాబాయి నర్సీ పాఠశాలలో చదువుకుంది. ఆమె ఎప్పుడూ బ్యాక్‌ బెంచ్‌ స్టూడెంటే.

 పాఠశాలలో ఉన్నప్పుడు ఐశ్వర్యరాయ్‌, కరీనా కపూర్‌, షారుక్‌ఖాన్‌ను అనుకరించేదట.
 ఆలియా కేవలం నటే కాదు.. పాటలు కూడా పాడుతుంది. ఆమె నటించిన వాటిలో ఆరు సినిమాల్లో పాటలు పాడింది. డ్యాన్సు కూడా బాగా చేయగలదు. నాలుగేళ్ల వయసులోనే షియామక్‌ దవార్స్‌ డ్యాన్సింగ్‌ స్కూల్‌కు వెళ్లి ప్రత్యేక శిక్షణ తీసుకుంది.

 సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ సంగీత పాఠశాలతో చేరేందుకు అవకాశమిచ్చారట.
 ‘సంఘర్ష్‌’ సినిమా ద్వారా బాలనటిగా బాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ సినిమాలో చిన్నప్పటి ప్రీతి జింతా పాత్రలో కనిపించింది. ఆ తర్వాత 2012లో ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ చిత్రంతో కథనాయికగా వెండితెరకు పరిచయమైంది. నటిగా ఆలియాకు ఈ సినిమా మంచి పేరు తెచ్చి పెట్టింది. చాలా మంది సినీ విమర్శకులు ఆలియాను కరీనా కపూర్‌తో పోల్చారు. 

• తన తండ్రి సినీ నిర్మాత అయినప్పటికీ.. ఆయన సినిమాలో నటించాలని ఎప్పుడూ అనుకోలేదట. ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ ఆడిషన్‌కు వచ్చిన 500 మంది అమ్మాయిలతో పాటే ఓ సాధారణ యువతిగా పాల్గొంది. అక్కడ ఉన్న కరణ్‌ జోహార్‌. ఆలియాను సినిమాకు ఎంపిక చేశాడు. అయితే ఆ సినిమాలో నటించేందుకు ఆలియా బరువు తగ్గాలని సూచించారు. అప్పటికి 67 కిలోలున్న ఆలియా మూడు నెలల్లోనే 16 కిలోల బరువు తగ్గింది.

 ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే ఆలియా సామాజిక మాధ్యమాల్లో తక్కువగా స్పందిస్తుంటుంది. కుటుంబ సభ్యుల కార్యక్రమాలను తెలుసుకునేందుకు ట్విటర్‌లో వాళ్లని ఫాలో అవుతుందట.

 అందంగా ఉండటం కోసం ఎక్కువగా నిద్ర పోతుందట. స్నేహితులతో పార్టీల్లో పాల్గొనేందుకు ఎక్కువగా ఇష్టపడుతుందట.
 2014లో ప్రముఖ మ్యాగజైన్‌ ఫోర్బ్స్‌ విడుదల చేసిన అత్యంత ప్రభావవంతుల జాబితా 30 అండర్‌ 30లో ఆలియా చోటు దక్కించుకుంది.

•  ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ డాబూ రత్నానీ 2014 క్యాలెండర్‌లో చోటు సంపాదించుకుంది. డాబూ బాలీవుడ్‌ నటుల ఫొటోలతో క్యాలెండర్‌ విడుదల చేస్తుంటారు.

• ఆలియా ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎక్కువగా నీళ్లు తాగడంతో పాటు,  తాజా పండ్లు తినేందుకు ఇష్టపడుతుంది. దోశ, జున్ను అంటే మరీ ఇష్టమట. ఇక రాత్రి పూట జీడిపప్పు, పాలు ఎక్కువగా తీసుకుంటుందట.

 పాప్‌ సింగర్‌ అనైదా.. అలియా భట్‌ చూడటానికి ఒకే పోలికతో ఉంటారు.

 ఓ సినిమాలో ఇమ్రాన్‌ హష్మీతో నటించే అవకాశం వచ్చింది. అయితే, అందులో రొమాంటిక్‌ సీన్లు ఎక్కువగా ఉన్న కారణంగా ఆ సినిమా తీసేందుకు ఇమ్రాన్‌ సుముఖత చూపించలేదు.

 ‘షాందార్‌’లో బికినీ సీన్‌లో నటించేందుకు చాలా కష్టపడిందట ఆలియా. అయితే, బికినీలో చాలా అందంగా ఉన్నావంటూ కత్రినా కైఫ్‌ పొగడ్తలతో ముంచెత్తడంతో తెగ సంబరపడిపోయిందట.

• ఆలియా పలు ఉత్పత్తులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గానూ వ్యవహరిస్తోంది. ఫ్రూటీ, డార్క్‌ ఫాంటసీ, ఉబర్‌ ఈట్స్‌, లక్స్‌, మేక్‌ మై ట్రిప్‌, కొనాటో తదితర ఉత్పత్తులకు ప్రచార కర్తగా ఉంది.

•  2019 ఆలియాకు ఎంతో ప్రత్యేకం. ఇప్పటికే ‘గల్లీబాయ్‌’తో ఘనవిజయాన్ని సొంతం చేసుకున్న ఈ సొట్ట బుగ్గల సుందరి. ‘బ్రహ్మాస్త్ర’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘కళంక్‌’, ‘సడక్‌ 2’ వంటి భారీ ప్రాజెక్టులతో పాటు, ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్2‌’ సినిమాలోనూ ఓ ప్రత్యేక గీతంలో నటిస్తోంది.

Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.