Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 84272
            [news_title_telugu_html] => 

2010లో సల్మాన్‌ ఇలా ఉంటాడు

[news_title_telugu] => 2010లో సల్మాన్‌ ఇలా ఉంటాడు [news_title_english] => [news_short_description] => మన హీరోలకు యాభై ఏళ్ల వయసొచ్చినా తెర మీద పాతికేళ్ల కుర్రాడి పాత్రల్లోనే కనిపిస్తూ రొమాన్స్‌ చేసేస్తుంటారు. అయితే సల్మాన్‌ ఖాన్‌ మాత్రం ఇదివరకెప్పుడూ కనిపించని ఓల్డ్‌ లుక్‌తో దర్శనమిచ్చి అభిమానులకు షాకిచ్చారు. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => || [news_videoinfo] => || [news_sections] => ,0207, ) )
2010లో సల్మాన్‌ ఇలా ఉంటాడు - EENADU
close
బాలీవుడ్
2010లో సల్మాన్‌ ఇలా ఉంటాడు

న హీరోలకు యాభై ఏళ్ల వయసొచ్చినా తెర మీద పాతికేళ్ల కుర్రాడి పాత్రల్లోనే కనిపిస్తూ రొమాన్స్‌ చేసేస్తుంటారు. అయితే సల్మాన్‌ ఖాన్‌ మాత్రం ఇదివరకెప్పుడూ కనిపించని ఓల్డ్‌ లుక్‌తో దర్శనమిచ్చి అభిమానులకు షాకిచ్చారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘భారత్‌’. కత్రినా కైఫ్‌ కథానాయిక. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకుడు. కొరియన్‌ చిత్రం ‘ఓడ్‌ టు మై ఫాదర్‌’కు రీమేక్‌గా తెరకెక్కుతోంది. దేశ విభజన అనంతరం అరవై ఏళ్ల కాలంలో దేశంలో చోటు చేసుకున్న పరిణామాలను స్పృశిస్తూ ఈ చిత్రం సాగుతుందట. అందులో భాగంగా సల్మాన్‌ పాతికేళ్ల యువకుడిగా,  మధ్య వయస్కుడిగా, వృద్ధుడిగా... ఇలా ఐదు రకాల గెటప్పుల్లో కనిపిస్తారట. దానికి సంబంధించి తాజాగా సల్మాన్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. నెరిసిన జుత్తు, గెడ్డం, కోర మీసంతో కళ్లజోడు ధరించి తీక్షణంగా చూస్తున్న సల్మాన్‌ ఓల్డ్‌ లుక్‌ ఆసక్తి కలిగిస్తోంది. పోస్టర్‌పై 2010 అని రాసి ఉండటంతో ఆ కాలంలో సల్మాన్‌ ఈ లుక్‌లో కనిపిస్తాడని అర్థమవుతోంది. దీంతో పాటు ‘ఒక వ్యక్తి, ఒక జాతి కలసి చేసిన ప్రయాణం’ అని పోస్టర్‌పై రాసి ఉంది. ఈ నెల 24న ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేస్తారు. జూన్‌ 5న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ముద్దు సన్నివేశాల్లో నటించడమే కాదు.. చూడటమూ ఇబ్బందే 
బాలీవుడ్‌ కథానాయకుడు సల్మాన్‌ఖాన్‌కు తను నటించే సినిమాల్లో ముద్దు సన్నివేశాలు చేయకూడదనేది ఓ నియమం. ఆరు నూరైనా... నూరు నూటయాభై అయినా ఆ నియమానికే కట్టుబడి ఉంటానని చెబుతున్నారు. ‘‘కుటుంబంతో కలిసి చూసేలా వినోదాత్మక చిత్రాల్లోనే నటిస్తాను. నిర్మాతగానూ అలాంటి సినిమాలే చేస్తాను. ఇప్పుడు నడుస్తున్న సినిమాల ట్రెండ్‌ చూస్తుంటే ముద్దు, అశ్లీలత విషయంలో నేను తీసుకున్న నిర్ణయం గురించి ఆలోచిస్తే ఆశ్చర్యమేస్తుంది’’ అని చెప్పారు సల్మాన్‌. ‘‘ముద్దు సన్నివేశాల్లో నటించడమే కాదు, సినిమాల్లో చూడటమూ నచ్చదు.  కుటుంబంతో కలిసి సినిమా చూస్తున్నప్పుడు ముద్దు సీన్‌ వస్తే చూడటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే కుటుంబంతో నా సినిమాలు చూడటానికి వచ్చే ప్రేక్షకులకు అసభ్యతకు తావులేని చిత్రాలే అందించాలని నా కోరిక. నా సినిమాలకు ‘ఎ’ సర్టిఫికెట్‌ ఎప్పటికీ రాదు.. ఒకవేళ వచ్చిందంటే అందులో యాక్షన్‌ ఎక్కువగా ఉందని అర్థం’’ అని చెప్పాడు సల్మాన్‌.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.