close
బాలీవుడ్
ఫలితాల తర్వాతే విడుదల

24న మోదీ బయోపిక్‌

ప్రధాని నరేంద్రమోదీ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘పీఎమ్‌ నరేంద్రమోదీ’. విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో ఎన్నికల పూర్తయ్యేవరకూ బయోపిక్‌లు విడుదల, ప్రచారం నిలిపివేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడంతో ఈ సినిమా విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాని ఈ నెల 24న విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. చిత్ర నిర్మాతల్లో ఒకరైన సందీప్‌ సింగ్‌ మాట్లాడుతూ ‘‘మాకు చట్టం అంటే గౌరవం ఉంది. అందుకే ఎన్నికల సంఘం ఆదేశాలను దృష్టిలో ఉంచుకొని ఈ నెల 24న విడుదల చేస్తున్నాం. 19తో ఎన్నికల పూర్తవుతాయి కాబట్టి మాకు ప్రచారానికి నాలుగు రోజులు సమయం ఉంటుంది. బహుశా ఈ కొత్త విడుదల తేదీతో ఎవరికీ ఎలాంటి సమస్యలు ఉండవని భావిస్తున్నామ’’ని చెప్పారు. ఒమంగ్‌కుమార్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో మోదీగా వివేక్‌ ఒబెరాయ్‌ నటించారు.

 


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.