close
బాలీవుడ్
క్లినిక్‌ తెరిచిన సోనాక్షి

సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఖాన్‌దానీ సఫాఖానా: సెక్స్‌ క్లినిక్‌’. ఇందులో బేబీ అనే యువతిగా నటిస్తోంది సోనాక్షి. బేబీకి ఓ బంధువు ద్వారా సెక్స్‌ క్లినిక్‌ వారసత్వ ఆస్తిగా వస్తుంది. దాన్ని అమ్మాలంటే ముందు ఆరు నెలలు స్వయంగా నడపాలన్న షరతు ఉంటుంది. దీంతో సెక్సాలజిస్ట్‌గా రంగంలోకి దిగిన బేబీకి క్లినిక్‌కు వచ్చే వారి నుంచి ఎలాంటి అనుభవాలు  ఎదురయ్యాయన్న కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. భారతీయ సమాజంలో లైంగిక విజ్ఞానం గురించి బహిరంగంగా మాట్లాడడానికి ఇష్టపడని ధోరణిని చర్చిస్తూ సున్నిత హాస్యంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ నవ్వులు పూయిస్తోంది. ప్రముఖ పాప్‌ గాయకుడు బాద్‌షా కీలక పాత్రలో నటిస్తున్నారు. శిల్పి దాస్‌ గుప్తా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే నెల 26న విడుదల చేయనున్నారు. సోనాక్షి ‘దబాంగ్‌ 3’లో సల్మాన్‌ ఖాన్‌తో, ‘మిషన్‌ మంగళ్‌’లో అక్షయ్‌ కుమార్‌తో కలసి నటిస్తోంది.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.