Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146768
            [news_title_telugu_html] => 

షోలో ఆమె కాళ్లు మొక్కిన అమితాబ్‌

[news_title_telugu] => షోలో ఆమె కాళ్లు మొక్కిన అమితాబ్‌ [news_title_english] => Kaun Banega Crorepati 11 Amitabh Bachchan touches social activist Sindhutai Sapkals feet [news_short_description] => బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ని చూడగానే ఎంతో మంది అభిమానులు, సినీ ప్రముఖులు ఆయన ఆశీర్వాదం తీసుకోవాలని చూస్తుంటారు. అలాంటిది స్టేజ్‌పై బిగ్‌బినే ఓ పెద్దావిడ కాళ్లు మొక్కారు. [news_tags_keywords] => amitabh,KBC,viral video [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => https://www.facebook.com/sonytelevision/videos/367947770551913 [news_sections] => ,0207, ) )
షోలో ఆమె కాళ్లు మొక్కిన అమితాబ్‌ - Kaun Banega Crorepati 11 Amitabh Bachchan touches social activist Sindhutai Sapkals feet - EENADU
close
బాలీవుడ్
షోలో ఆమె కాళ్లు మొక్కిన అమితాబ్‌

వీడియో షేర్‌ చేసిన బిగ్‌బి

ముంబయి: బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ని చూడగానే ఎంతో మంది అభిమానులు, సినీ ప్రముఖులు ఆయన ఆశీర్వాదం తీసుకోవాలని చూస్తుంటారు. అలాంటిది స్టేజ్‌పై బిగ్‌బినే ఓ పెద్దావిడ కాళ్లు మొక్కారు. ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కౌన్‌ బనేగా కరోడ్‌పతి షోలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంతకీ ఆమె ఎవరంటే.. సింధూతాయ్‌ సప్కల్‌. ఆమె ఓ సామాజికవేత్త. దాదాపు వెయ్యి మందికిపైగా అనాథలకు అన్నీ తానై చూసుకుంటోంది. ఇటీవల జరిగిన ఎపిసోడ్‌లో సింధూతాయ్‌ పాల్గొన్నారు.

‘నీ కన్నీటి ద్వారా జీవితాన్ని చూడు. ఏడ్చిన తర్వాత నవ్వడం నేర్చుకో. ఎందుకంటే నేను నీకు తల్లిలాంటిదాన్ని. నీతోనే ఉంటాను బేటా’ అంటూ సింధూతాయ్‌.. బిగ్‌బి ముందు మరాఠీలో ఓ పద్యం పాడారు. ఆ తర్వాత ఆమె గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకున్న బిగ్‌బి సీటు నుంచి లేచి ఆమె పాదాలను నమస్కరించారు. ఈ వీడియో ప్రోమోను అమితాబ్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘స్ఫూర్తి, గౌరవంతో..’ అని పేర్కొన్నారు. ఈ ఎపిసోడ్‌ను శుక్రవారం ప్రసారం చేయనున్నారు.

 

 

 

 



Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.