close
బాలీవుడ్
జపాన్‌ వెళ్తున్న ‘గల్లీ బాయ్‌’

ణ్‌వీర్‌ సింగ్‌, ఆలియా భట్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘గల్లీ బాయ్‌’ ఈ ఏడాది విడుదలై విజయాన్ని అందుకుంది. జోయా అక్తర్‌ తెరకెక్కించిన  ఈ చిత్రం అంతర్జాతీయ చిత్రోత్సవాల్లోనూ ప్రదర్శితమై ప్రశంసలందుకుంది. ఇప్పుడు జపాన్‌ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఈ నెల 3న అక్కడి థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా జోయా అక్తర్‌ జపాన్‌కు వెళ్లి అభిమానులతో ముచ్చటించనున్నారు. ర్యాప్‌ గాయకుడిగా ఎదగాలని కలలు కనే ఓ మురికివాడ కుర్రాడు తన స్వప్నాన్ని ఎలా సాకారం చేసుకున్నాడన్న కథతో ఈ చిత్రం తెరకెక్కింది. కల్కి కొచ్లిన్‌, సిద్ధాంత్‌ చతుర్వేది కీలక పాత్రల్లో నటించారు. ప్రముఖ ర్యాప్‌  గాయకులు డివైన్‌, నేజీ జీవితాల స్ఫూర్తితో ఈ చిత్రాన్ని రూపొందించారు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.