close
బాలీవుడ్
విక్కీని రక్షించండి

బాలీవుడ్‌ యువ కథానాయకుడు విక్కీ కౌశల్‌ ప్రధాన పాత్రలో ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్న చిత్రం ‘భూత్‌- పార్ట్‌వన్‌: ది హాంటెడ్‌ షిప్‌’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు కరణ్‌. విక్కీ సముద్రంలో మునిగిపోతూ ఉంటాడు. అతడు ఒక్కడే కాదు పక్కన ఓ ఆడదెయ్యం ఉంటుంది. ఆ దెయ్యం విక్కీని బలంగా లాగుతూ నీటిలో ముంచే ప్రయత్నం చేస్తుంటుంది. ఆసక్తికరంగా ఉన్న ఈ పోస్టర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ‘‘విక్కీ చాలా భయంగా ఉన్నాడు. నవంబరు 15న  మీ దగ్గర్లోని థియేటర్‌కు వస్తున్న హాంటెడ్‌ షిప్‌ నుంచి అతణ్ని రక్షించండి’’అని పోస్ట్‌ చేశారు కరణ్‌. భాను ప్రతాప్‌ సింగ్‌ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో భూమి పెడ్నేకర్‌ నాయిక.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.