close
బాలీవుడ్
క్యాలిక్యులేటర్‌.. కంప్యూటర్‌.. ఆమె ముందు బలాదూర్‌

పక్క క్యాలిక్యులేటర్‌, ఇంకో పక్క కంప్యూటర్‌, మధ్యలో విద్యా బాలన్‌ నిలుచున్న ఈ చిత్రం చూశారా... భలే చిత్రంగా ఉంది కదూ. క్యాలిక్యులేటర్‌నే కాదు.. కంప్యూటర్‌నీ ఓడించి మరీ నెంబర్‌ 1 స్థానంపై ఠీవీగా నిలుచుందంటే విద్యా మామూలు మనిషి కాదు.. హ్యూమన్‌  కంప్యూటర్‌ అయి ఉండాలి. అవును.. ఆమె హ్యూమన్‌  కంప్యూటర్‌గానే మారిపోయింది  ఓ సినిమా కోసం. గణితంలో  అసమాన ప్రావీణ్యంతో హ్యూమన్‌ కంప్యూటర్‌గా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలందుకున్న గణితవేత్త  శకుంతలా దేవి. ఆమె జీవితకథతో బాలీవుడ్‌లో రూపొందుతున్న చిత్రం ‘శుకుంతలా దేవి: హ్యూమన్‌ కంప్యూటర్‌’. విద్యా బాలన్‌ ప్రధాన పాత్రలో నటిస్తోంది. దర్శకురాలు అను మేనన్‌ తెరకెక్కిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ సోమవారం మొదలైంది. ఈ సందర్భంగా ఈ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో పొట్టి జుత్తుతో ఎర్రచీరలో ఉన్న విద్యా గెటప్‌ ఆకట్టుకుంటోంది.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.