close
బాలీవుడ్
నవాబ్‌ను ప్రేమించి.. పెళ్లాడి..!

కరీనా కపూర్‌ జీవితం.. మీకివి తెలుసా?

కోట్లాదిమంది అమ్మాయిలకు స్ఫూర్తి ఆమె.. అనేక మంది నటీమణులకు పోటీ ఆమె. ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా ఎంతో ఫిట్‌గా.. నేటి కథానాయికలకు ఏ మాత్రం తీసుపోకుండా ఆకట్టుకుంటున్నారు ఆ భామ. ఇంతకీ ఆమె ఎవరు? అనుకుంటున్నారా? ఎవరో కాదండీ బాలీవుడ్‌ ముద్దుగుమ్మ కరీనా కపూర్‌. శనివారం ఆమె 39వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా కరీనా గురించి కొన్ని ఆసక్తికర విషయాల్ని చూసేద్దాం..

సినీ నేపథ్యం నుంచి..

సెప్టెంబరు 21, 1980లో కపూర్‌ కుటుంబంలో జన్మించిన కరీనాకు చిన్నతనం నుంచే నటనపై ఆసక్తి ఉండేది. అలనాటి తారలు నర్గీస్‌, మీనా కుమారి తనకు స్ఫూర్తిదాయకమని పలు సందర్భాల్లో కరీనా చెప్పారు. కొన్ని కారణాల వల్ల కరీనా తల్లి బిబితా తన భర్త రణ్‌ధీర్‌ కపూర్‌ నుంచి విడిపోయారు. కొన్నేళ్లకు మళ్లీ కలుసుకున్నారు. ‘నా జీవితంలో మా నాన్న ఎంతో ముఖ్యమైన వ్యక్తి. మా చిన్నతనంలో ఆయనతో సమయం గడపలేకపోయాం. ఇప్పుడు మేం మంచి కుటుంబం’ అని కరీనా అన్నారు.

తొలి ప్రాజెక్టు వద్దనుకుని..

హృతిక్‌ రోషన్‌ కథానాయకుడిగా వెండితెరకు పరిచయమైన చిత్రం ‘కహోనా ప్యార్‌ హై’ (2000). ఆయన తండ్రి రాకేష్‌ రోషన్‌ తెరకెక్కించారు. ఈ సినిమాలో కథానాయికగా కరీనా సంతకం చేశారు. కొన్ని రోజుల షూటింగ్‌ తర్వాత ప్రాజెక్టు నుంచి తప్పుకొన్నారు. ఆ తర్వాత అభిషేక్‌ బచ్చన్‌ నటించిన ‘రెఫ్యూజీ’తో నటిగా అరంగేట్రం చేశారు. ఆపై ఎన్నో హిట్‌ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘వీరే ది వెడ్డింగ్‌’ (2018)లో కరీనా చివరిసారి వెండితెరపై కనిపించారు. ప్రస్తుతం ఆమె ‘గుడ్‌న్యూస్‌’లో నటిస్తున్నారు.

విమర్శల నుంచి..

కెరీర్‌ ఆరంభంలో కరీనా కాస్త బొద్దుగా ఉండేవారు. దీంతో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. వీటిని ఛాలెంజ్‌గా తీసుకున్న ఆమె ఎంతో సాధన చేసి నాజూకుగా తయారయ్యారు. 2008లో వచ్చిన ‘తషాన్‌’ సినిమాలో ఆమె బికినీ ఎంట్రీ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

షాహిద్‌తో ప్రేమ..

‘ఫిదా’ (2004) సినిమా సమయంలో హీరో షాహిద్‌ కపూర్‌, కరీనా ప్రేమించుకున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆపై కొన్ని కారణాల వల్ల వీరు విడిపోయినట్లు వదంతులు వచ్చాయి. ఈ విషయం గురించి కరీనాను ప్రశ్నించగా.. ‘షాహిద్‌ నా జీవితంలో సానుకూల దృక్పథాన్ని (పాజిటివిటీ) నింపిన వ్యక్తి’ అన్నారు.

మోస్ట్‌ బ్యూటిఫుల్‌ ఉమన్‌..

2010 జూన్‌లో పీపుల్‌ మ్యాగజైన్‌ ఆమెకు ‘ఇండియన్‌ మోస్ట్‌ బ్యూటిఫుల్‌ ఉమన్‌’ టైటిల్‌ ఇచ్చింది. 2011 ‘ఈస్టర్న్ ఐ’ అనే బ్రిటిష్‌ న్యూస్‌పేపర్‌ ఆమెను ‘ఆసియా సెక్సియస్ట్‌ ఉమన్’గా వర్ణించింది. 2012 నుంచి 2018 వరకు కరీనా  ‘ఫోర్బ్స్‌ ఇండియా’ టాప్‌-100 సెలబ్రిటీల జాబితాలో ఉన్నారు.

సైఫ్‌తో పెళ్లి..

షాహిద్‌తో విడిపోయిన తర్వాత కరీనా హీరో, పటౌడీ వంశానికి చెందిన సైఫ్‌ అలీ ఖాన్‌తో ప్రేమలో పడ్డారు. తాము డేటింగ్‌లో ఉన్నామని 2007 ‘లాక్మే ఫ్యాషన్‌ వీక్‌’లో ఈ జంట వెల్లడించింది. 2012లో కరీనా, సైఫ్‌ల వివాహం జరిగింది. వీరికి డిసెంబరు 20 2016లో కుమారుడు తైమూర్‌ అలీ ఖాన్‌ జన్మించాడు.

తక్కువ వ్యవధిలోనే..

అమ్మ అయిన తర్వాత బరువు పెరగడం సహజం. సినీ స్టార్స్‌ దీనికి అతీతం కాదు. కరీనా కూడా తైమూర్‌కు జన్మనిచ్చిన తర్వాత చాలా బరువు పెరిగారు. ఆ తర్వాత తక్కువ వ్యవధిలోనే జిమ్‌లో కసరత్తులు చేసి, డైట్‌ పాటించి సన్నబడ్డారు. ఈ విషయంలో ఆమె అందరికీ స్ఫూర్తి అనడంలో అతిశయోక్తి లేదు.

పటౌడీ ప్యాలెస్‌లో సంబరాలు

పటౌడీ ప్యాలెస్‌లో కరీనా పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. శుక్రవారం రాత్రి సైఫ్‌ ఆమెతో కేక్‌ కట్‌ చేయించారు. వేడుకల్లో కరీనా సోదరి కరిష్మా కపూర్, కుటుంబ సభ్యులు, స్నేహితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన సోదరితో కలిసి దిగిన ఫొటోలను, వీడియోను కరిష్మా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. నెటిజన్లు ఆమెను శుభాకాంక్షల వెల్లువలో ముంచెత్తారు.

-ఇంటర్నెట్‌డెస్క్‌

 

 



Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.