close
బాలీవుడ్
రీమేక్‌తో హిట్టు కొట్టి...సీక్వెల్‌కు సై!

‘అర్జున్‌ రెడ్డి’ రీమేక్‌ ‘కబీర్‌ సింగ్‌’లో కథానాయికగా నటించి బాలీవుడ్‌లో ఘన విజయం అందుకుంది కియారా అడ్వాణీ. ఇప్పుడు ఓ సీక్వెల్‌ చిత్రానికి పచ్చ జెండా ఊపేసింది. అక్షయ్‌ కుమార్‌ కథానాయకుడిగా 12 ఏళ్ల క్రితం వచ్చిన హారర్‌ కామెడీ చిత్రం ‘భూల్‌     భులాయియా’. దీనికి కొనసాగింపుగా ‘భూల్‌ భులాయియా 2’ తెరకెక్కుతోంది. ఈ ఏడాది ‘లుకా చుప్పి’తో విజయాన్ని అందుకున్న కార్తిక్‌ ఆర్యన్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. అనీస్‌ బజ్మీ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో నాయికగా కియరా అడ్వాణీ ఎంపికైంది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించింది కియారా. ‘‘నేను చూసిన మొట్టమొదటి హారర్‌ చిత్రం ‘భూల్‌ భులాయియా’. ఆ ప్రాంఛైజీలో వస్తున్న ఈ చిత్రంలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంద’’ని చెప్పింది కియారా.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.