close
బాలీవుడ్
ఆస్కార్‌కు ‘గల్లీ బాయ్‌’

ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ పురస్కారాల పోటీకి బాలీవుడ్‌ చిత్రం ‘గల్లీ బాయ్‌’ ఎంపికైంది. ఈ చిత్రం వచ్చే ఫిబ్రవరిలో జరగనున్న 92వ ఆస్కార్‌ వేడుకలో ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో భారత్‌ తరఫున బరిలో నిలవనుంది. ఫిలిం ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో ఏటా మన దేశంలో వచ్చిన ఉత్తమ చిత్రాలను పరిశీలించి అందులో ఓ చిత్రాన్ని ఆస్కార్‌కు అధికారిక ఎంట్రీగా పంపిస్తుంటారు. అందుకోసం ఈసారి 28 చిత్రాలు పోటీపడ్డాయి. అందులో తెలుగు చిత్రం ‘డియర్‌ కామ్రేడ్‌’ కూడా ఉంది. అయితే ‘గల్లీ బాయ్‌’కే ఆ అవకాశం దక్కింది. రణ్‌వీర్‌ సింగ్‌, ఆలియా భట్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని జోయా అక్తర్‌ తెరకెక్కించారు. ఫరాన్‌ అక్తర్‌, రితేష్‌ సిధ్వాని నిర్మించారు. ముంబయిలోని ఓ మురికివాడకు చెందిన నిరుపేద యువకుడు ర్యాప్‌ గాయకుడిగా ఎదగాలన్న కలను ఎలా నెరవేర్చుకున్నాడన్నది ఈ చిత్ర కథాంశం.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.