close
బాలీవుడ్
హృతిక్‌కు జోడీగా అనుష్క

హృతిక్‌ రోషన్‌ ప్రస్తుతం ‘వార్‌’ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఆయన నటించిన ఈ చిత్రం  పది రోజుల్లోనే రూ.245 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. కాగా హృతిక్‌ తదుపరి అనుష్క శర్మతో జోడీ కట్టనున్నట్లు తెలుస్తోంది. దర్శకురాలు ఫరా ఖాన్‌తో మరో దర్శకుడు రోహిత్‌ శెట్టి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘సత్తే పే సత్తా’కు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కనుందని, అందులో కథానాయకుడిగా హృతిక్‌ను ఎంచుకున్నారని కొన్ని రోజులుగా ప్రచారంలో ఉంది. ఇప్పుడు హృతిక్‌ సరసన నాయికగా అనుష్క శర్మను ఖరారు చేశారని వినిపిస్తోంది. ‘‘హృతిక్‌, అనుష్క కలసి నటిస్తున్న విషయం నిజమే. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ చిత్రాన్ని సెట్స్‌ పైకి తీసుకెళ్లేందుకు ఫరా సన్నాహాలు చేస్తోంద’’ని చిత్రబృంద సన్నిహిత వర్గాలు తెలిపాయి. అదే నిజమైతే హృతిక్‌, అనుష్క నటిస్తున్న  తొలి చిత్రమిదే అవుతుంది.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.