close
బాలీవుడ్
‘దీవానా మస్తానా’కు సీక్వెల్‌

నిల్‌ కపూర్‌, గోవిందా కథానాయకులుగా 22 ఏళ్ల క్రితం వచ్చిన చిత్రం ‘దీవానా మస్తానా’. డేవిడ్‌ ధావన్‌ తెరకెక్కించిన ఈ రొమాంటిక్‌ కామెడీ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ను    తెరకెక్కించనున్నట్లు అనిల్‌ కపూర్‌ వెల్లడించారు. ఇటీవల అనిల్‌ కపూర్‌, గోవిందా ఓ డ్యాన్స్‌ రియాలిటీ షోకు  అతిథులుగా వచ్చి సందడి చేశారు. వేదికపై ఇద్దరూ కలసి స్టెప్పులేశారు. ఆ ఆనందంలోనే ‘దీవానా మస్తానా 2’ గురించి ప్రకటించారు. ‘‘గోవిందా, నేను చాలా రోజుల తర్వాత కలసిన ఈ శుభ సందర్భంలో ‘దీవానా మస్తానా’ సీక్వెల్‌ గురించి ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో మా ఇద్దరితో పాటు జాన్‌ అబ్రహంను ఎంచుకునే ఆలోచన ఉంద’’ని తెలిపారు అనిల్‌ కపూర్‌.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.