
విరిగే అవకాశంలేని బ్యాగ్‌ను కూడా విరిచేశారు
ముంబయి: ప్రముఖ ఎయిర్‌లైన్ సంస్థ ఇండిగో సిబ్బందిపై బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా మండిపడ్డారు. విరగడానికి అవకాశంలేని తన బ్యాగ్‌ను విరిచేశారని అన్నారు. ఈ మేరకు ఆమె సోషల్‌మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ఇండిగో ప్రయాణం పూర్తయిన తర్వాత తన బ్యాగ్ హ్యాండిల్, చక్రాలు వేరయ్యాయంటూ వీడియోను షేర్ చేశారు. ‘ఇవాళ ఇండిగో విమానంలో ప్రయాణించా. పర్ఫెక్ట్గా ఉన్న బ్యాగ్‌తో నా జర్నీ మొదలైంది. కానీ పూర్తిగా విరిగిపోయిన హ్యాండిల్‌తో, ఓ చక్రం లేకుండా నా బ్యాగును అప్పగించారు. మీకు ధన్యవాదాలు ఇండిగో’ అని ఈ సందర్భంగా ఆమె అన్నారు.
ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు వివిధ సందర్భాల్లో ఇండిగో సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది లగేజీ విషయంలో చాలా దురుసుగా వ్యవహరిస్తున్నట్టు తెలిపారు. ఇటీవల ప్రముఖ సంగీత కళాకారుడు శభేంద్ర రావు ఫేస్బుక్లో ఇండిగోను ఉద్దేశించి పోస్ట్ చేశారు. తన వీణను సిబ్బంది నాశనం చేసిందంటూ ఫొటోను కూడా షేర్ చేశారు.
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- తీర్పు చెప్పిన తూటా
- కిర్రాక్ కోహ్లి
- సచిన్ కుమారుడు ఎందుకు ఆడొద్దు?
- ఎన్‌కౌంటర్‌తో న్యాయం జరగలేదు
- ఆ కిరాతకులు ఎలా దొరికారు?
- ఉన్నావ్ ఘటన బాధితురాలు మృతి
- ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ
- ఈ అరటిపండు ధర రూ. 85 లక్షలు!
- విజృంభించిన విరాట్.. టీమిండియా విజయం
- ఆ రెండు రోజులూ ఏం జరిగింది?