close
బాలీవుడ్
‘బెల్‌ బాటమ్‌’ రీమేక్‌లో?

స్టార్‌ ఇమేజ్‌తో సంబంధం లేకుండా వైవిధ్యమైన కథల్లో నటిస్తుంటారు అక్షయ్‌కుమార్‌. కథలో సత్తా ఉంటే రీమేకుల్లో చేయడానికి కూడా ఆయనే సిద్ధమే. ఆయన ఓ కన్నడ రీమేక్‌లో నటించబోతున్నట్టు సమాచారం. ఈ ఏడాది కన్నడలో విజయవంతమైన ‘బెల్‌ బాటమ్‌’ని హిందీలో రీమేక్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత నిఖిల్‌ అడ్వాణీ. ‘లక్నో సెంట్రల్‌’ చిత్ర దర్శకుడు రంజిత్‌ తివారీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ‘‘బెల్‌ బాటమ్‌’ కన్నడలో భారీ విజయం సాధించింది. ఈ క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌ చిత్రం అక్షయ్‌కు బాగా నచ్చింది. ‘లక్నో సెంట్రల్‌’ ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయినా రంజిత్‌పై నమ్మకంతో ఈ రీమేక్‌ బాధ్యతలు అప్పజెబుతున్నారు’’ అని నిఖిల్‌ సన్నిహితులు  చెప్పినట్టు సమాచారం. ‘బెల్‌ బాటమ్‌’ను తమిళ, తెలుగు భాషల్లోనూ రీమేక్‌ చేయడానికి పలువురు ఆసక్తి చూపిస్తున్నారు.



Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.