close
బాలీవుడ్
ఆ మానవ మృగం మైనరా?

ఉద్యోగ శిక్షణ సంస్థలకు పేరుగాంచిన రాజస్థాన్‌లోని కోటకు దేశం నలుమూలల నుంచి విద్యార్థులు వస్తుంటారు. అలా వచ్చే అమ్మాయిల మీద ఓ సైకో కన్నేస్తాడు. పైశాచికంగా అత్యాచారం చేసి చంపుతుంటాడు. అతణ్ని పట్టుకోవడానికి రంగంలోకి దిగుతుంది ఐపీయస్‌ అధికారి శివానీ శివాజీరాయ్‌. ఆమెకే సవాల్‌ విసురుతూ చీకటి పడేలోపు ఇంకో అమ్మాయిని చంపబోతున్నానని, దమ్ముంటే ఆపుకోమని సమాచారమిస్తాడు. అనుకున్నట్లే ఇంకో అమాయకపు ఆడపిల్ల బలైపోతుంది. ఆ మానవ మృగాన్ని పట్టుకోవడానికి శివానీ ఎలాంటి వ్యూహం పన్నింది? ఇంతకీ ఆ సైకో ఎవరు? అనే విషయాలతో తెరకెక్కుతున్న చిత్రం ‘మర్దానీ 2’. శివానీగా రాణీ ముఖర్జీ కనిపించనుంది. ఆమె నటించిన ‘మర్దానీ’కి సీక్వెల్‌ ఇది. గోపీ పుత్రన్‌ దర్శకుడు. ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. ఏటా రెండు వేలకు పైగా అత్యాచార కేసుల్లో దోషులు మైనర్లేనన్న విషయాన్ని అందులో చూపించారు. దీన్నిబట్టి మైనర్లలో పెరుగుతున్న నేరప్రవృత్తిని ఇందులో చర్చించనున్నట్లు తెలుస్తోంది. డిసెంబరు 13న విడుదల చేస్తారు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.