close
బాలీవుడ్
అనుష్క నటించిన ఆ సినిమా అంటే ఇష్టం: విరాట్

ముంబయి: విరుష్క.. ఒకరు సినిమాల్లో.. మరొకరు క్రికెట్‌లో రాణిస్తూ చాలా బిజీగా జీవితాన్ని గడుపుతున్నారు. వీరిద్దరికి ఏ కాస్త సమయం దొరికినా తమ వ్యక్తిగత జీవితాన్ని సంతోషంగా ఆస్వాదిస్తుంటారు. ఇటీవల విరాట్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ జంట భూటాన్‌ టూర్‌కు వెళ్లారు. పని ఒత్తిడిని మర్చిపోయి సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన ఫొటోలను సైతం విరాట్‌, అనుష్క శర్మ సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

అయితే తాజాగా విరాట్‌ ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో భాగంగా అనుష్కశర్మ నటించిన ‘ఏ దిల్‌ హై ముష్కిల్‌’ చిత్రమంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు. ‘అనుష్క నటించిన చిత్రాలన్నింటిలోనూ నాకెంతో ఇష్టమైనది  ‘ఏ దిల్‌ హై ముష్కిల్‌’. ఆ సినిమాలో తన పాత్రంటే నాకెంతో ఇష్టమని నేను ఇప్పటికీ అనుష్కకు చెబుతుంటాను.  సమయం దొరికొనప్పుడు యూట్యూబ్‌లో ఆ సినిమా చూస్తుంటాను. అనుష్కకు క్యాన్సర్‌ రావడం.. కొంతకాలం తర్వాత ఆమె తిరిగి రణబీర్‌ను కలవడం.. ఆ సమయంలో వచ్చే ఓ పాట నన్ను ఎంతో బాధపెడుతుంది. ఆ పాట నా హృదయాన్ని ద్రవింప చేస్తుంది.’ అని విరాట్‌ పేర్కొన్నారు.

గతేడాది విడుదలైన ‘జీరో’ సినిమాలో అనుష్క శర్మ నటించారు. షారుక్‌ ఖాన్‌ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనలు లభించాయి. ప్రస్తుతం అనుష్క ఓ వెబ్‌ సిరీస్‌కు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

 



Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.