close
అప్పటి ముచ్చట్లు

 

ఎన్టీఆర్‌ హనుమంతుడిగా ఎందుకు చేయలేదంటే!

 

ఎన్టీఆర్‌ హనుమంతుడిగా ఎందుకు చేయలేదంటే!

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు ప్రేక్షకులకు రాముడు, కృష్ణుడు అంటే గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు నందమూరి తారక రామారావు. పౌరాణిక పాత్రలు ఆయనకు కొట్టిన పిండి. డైలాగులు, హావభావాలు పలికించడంలో ఆయనకు తిరుగులేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే పౌరాణిక పాత్రలకు, చిత్రాలకు ఆయన నిఘంటువు. రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, భీముడు, రావణుడిగా ఎన్నో పాత్రల్లో ఒదిగిపోయారు. కృష్ణుడిగా దాదాపు 33సార్లు తెరపై కనిపించి రికార్డు సృష్టించారు. మరి అంత పేరు ప్రఖ్యాతులను సంపాదించిన ఆయన తన సినీ ప్రస్థానంలో నారదుడు, హనుమంతుడి పాత్రలను మాత్రం వేయలేదు. ఇదే విషయాన్ని ఓసారి ఆయన వద్ద ప్రస్తావిస్తే..

‘‘అప్పట్లో షూటింగ్స్‌ జరుగుతున్నప్పుడు తరుచూ కరెంటు పోయేది. మళ్లీ ఎప్పుడొస్తుందో తెలియదు. కరెంటు వచ్చేదాకా, అందరూ ఫ్లోర్‌ బయటకి వచ్చి కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకునేవాళ్లు. అలా ఓ చిత్ర షూటింగ్‌ సమయంలో కరెంటు పోతే ఫ్లోర్‌ బయట కూర్చుని ఎన్టీఆర్‌ పౌరాణిక పాత్రల గురించి మాట్లాడుతున్నారు. అందరూ ఆసక్తిగా వింటున్నారు. అక్కడే ఉన్న రావి కొండలరావు మధ్యలో కలగజేసుకుని ‘నారదుడు, హనుమంతుడు వంటివి ముఖ్య పాత్రలే కదా! అన్నగారూ... ఆ పాత్రల్లో మిమ్మల్ని చూసే అవకాశం ఉందా?’ అని అడిగారట. అప్పుడు ఎన్టీఆర్‌ బదులిస్తూ.. ‘నారదుడిగా ఆలోచించాను బ్రదర్‌. హాస్యం వచ్చేలా కాకుండా భక్తుడిగా, సర్వజ్ఞుడిగా గంభీరంగా ప్రదర్శించవచ్చు. కానీ, నా రూపం అందుకు సహకరించదేమోనని సాహసించలేదు. నారదుడు అంటే ఇలాగే ఉండాలి అని మనం ఒక విధమైన రూపానికి అలవాటు పడ్డాం. నా శరీరం కాస్త భారీ అవుతుందని ఆ ఆలోచన రానివ్వలేదు. రంగారావుగారిని నారదుడి పాత్రలో ఊహించుకోగలమా? పర్సనాలిటీలు ఒప్పుకోవు. ఇక హనుమంతుడంటారా? నా ముఖం కానప్పుడు నాకెందుకా పాత్ర? మాస్క్‌తో నటించాలి. ఫిజికల్‌ మూవ్‌మెంట్స్‌‌ ఎక్కువ కావాలి’ అని విశ్లేషించారట ఎన్టీఆర్‌.

పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలతో వెండితెరపై అదరగొట్టిన ఎన్టీఆర్‌ తెలుగువారి గుండెల్లో అభిమాన నటుడిగా చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా నందమూరి బాలకృష్ణ ‘ఎన్టీఆర్‌’ పేరుతో బయోపిక్‌ను తీస్తున్నారు. తేజ దర్శకుడు. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. ఎన్టీఆర్‌ మద్రాసు చేరుకున్నప్పటి నుంచి సినీ రంగంలో తిరుగులేని ధ్రువతారగా, రాజకీయ రంగంలో అశేష ప్రజాభిమానాన్ని సొంతం చేసుకున్న ముఖ్యమంత్రిగా ఇలా ఆయన జీవితంలోని ఘట్టాలన్నీ వెండితెరపై ఆవిష్కరించనున్నారు. ఈ ఏడాది దసరా కానుకగా సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం యోచిస్తోంది.

Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.