Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 101783
            [news_title_telugu_html] => 

వాళ్ల దృష్టి నుంచి తప్పించుకున్న ‘భైరవద్వీపం’

[news_title_telugu] => వాళ్ల దృష్టి నుంచి తప్పించుకున్న ‘భైరవద్వీపం’ [news_title_english] => There was No Single cut Balakrishana Bhairava Dweepam [news_short_description] => చందమామ విజయా కంబైన్స్‌ నిర్మించిన జానపద చిత్రం ‘భైరవద్వీపం’ సెన్సార్‌ చేసినప్పుడు ఒక్క కట్‌ కూడా లేదు. అయితే, సెన్సార్‌ పూర్తయిన తర్వాత వాళ్లు ఒక [news_tags_keywords] => Bhairava Dweepam,Balakrishna,Roja [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [news_sections] => ,0208, ) )
వాళ్ల దృష్టి నుంచి తప్పించుకున్న ‘భైరవద్వీపం’ - There was No Single cut Balakrishana Bhairava Dweepam - EENADU
close
అప్పటి ముచ్చట్లు
వాళ్ల దృష్టి నుంచి తప్పించుకున్న ‘భైరవద్వీపం’

ఇంటర్నెట్‌డెస్క్‌: చందమామ విజయా కంబైన్స్‌ నిర్మించిన జానపద చిత్రం ‘భైరవద్వీపం’ సెన్సార్‌ చేసినప్పుడు ఒక్క కట్‌ కూడా లేదు. అయితే, సెన్సార్‌ పూర్తయిన తర్వాత వాళ్లు ఒక హెచ్చరిక చేశారట! బాణాలకి గుర్రాలు దారుణంగా పడిపోయిన షాట్స్‌ గురించి చెబుతూ, ‘మా వరకూ అభ్యంతరం లేదు. కానీ, వన్య ప్రాణి సంరక్షణ సంఘం వాళ్లు అభ్యంతర పెడితే మాత్రం గుర్రాలు పడిపోయిన షాట్స్‌ తొలగించమంటారు’ అని చెప్పారు. అయితే, ఆ సన్నివేశాలు వాళ్ల దృష్టిలో పడలేదు కాబోలు ఆ షాట్స్‌ తప్పించుకున్నాయి.

అయితే, గుర్రాలు పడిపోయే విధానం చూస్తే మాత్రం వాళ్లు అంగీకరించరు. గుర్రాలు చాలా వేగంతో పరిగెత్తుతూ వస్తూ ఉంటాయి. వాటి కాళ్లకు అడ్డం తగిలేలా వైర్లు కడతారు. గుర్రాల కాళ్లకు వైర్లు అడ్డం రాగానే అవి పడిపోతాయి. ఆ పడిపోవడంలో వాటి కాళ్లు విరగవచ్చు. దెబ్బలూ తగలవచ్చు. కాస్త రిస్క్‌తో కూడుకున్న సన్నివేశాలవి. వెంటనే రౌతులు, గుర్రాల యజమానులు వచ్చి పడిపోయిన గుర్రాలను లేపి కాళ్లు, ఒళ్లు చూస్తారు. కొన్ని నడవలేని స్థితిలో ఉంటే వెంటనే వైద్యుడికి చూపించి, వాటికి చికిత్స చేయించేవాళ్లు.

బాలకృష్ణ కథానాయకుడిగా సింగీతం శ్రీనివాససరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. జానపద హీరోగా బాలకృష్ణ అద్భుతంగా నటించారు. 


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.