
ఇంటర్నెట్డెస్క్: తన సుమధుర గానంతో శ్రోతలకు వీనుల విందును పంచిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం. గాయకుడిగానే కాదు, డబ్బింగ్ కళాకారుడిగా, నటుడిగా వెండితెర ముందూ వెనుక తనదైన ముద్రవేశారు. గాయకుడిగా బిజీగా ఉన్న సమయంలోనూ చక్కని పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు. బాలూ తొలిసారిగా వెండితెరపై కనిపించిన చిత్రం మహమ్మద్ బీన్ తుగ్లక్(1972).
ఆ సినిమాలో ఒక పుట్టిన రోజు వేడుక ఉంది. ఆ వేడుకలో ఒకరు పాట పాడాలి. ఆ పాటను బాల సుబ్రహ్మణ్యంతో పాడించి రికార్డు చేయించారు. అయితే, ఆ సన్నివేశంలో ఎవరు నటిస్తే బాగుంటుందా? అని తర్జనభర్జనలు పడ్డారు దర్శక-నిర్మాతలు. అయితే షూటింగ్ చేసే సమయానికి సినిమాలో కూడా బాలూతోనే పాట పాడిస్తే బాగుంటుందని నిర్ణయానికి వచ్చారు. ఇదే విషయం బాల సుబ్రహ్మణ్యంకు చెబితే ఆయన అంగీకరించారు. అలా గాన గంధ్వరుడు తొలిసారి తెరపై కనిపించారు. నటుడిగా ఎన్నో గుర్తుండిపోయే పాత్రలను చేసిన బాలసుబ్రహ్మణ్యం బాపు-రమణల రెండో చిత్రం ‘బంగారు పిచిక’లో కథానాయకుడిగా చేసేందుకు మాత్రం అంగీకరించలేదు.
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ఆ ‘ఈగ’ పరమ అసహ్యంగా ఉంది!
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- విశ్వసుందరి.. జోజిబిని టుంజీ
- ఎన్కౌంటర్పై అనుమానాలున్నాయా?
- ఆ ఉరితాళ్లు.. నిర్భయ దోషులకేనా?
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- గుర్రమెక్కుతుంటే బాదేశారు... తాళి కడుతుంటే ఆపేశారు!