close
అప్పటి ముచ్చట్లు
అందుకే హీరోయిన్‌ చెంప పగలగొట్టా!

హైదరాబాద్‌: ఒకప్పుడు వరుస విజయాలతో యువత మెచ్చే చిత్రాలను తీసిన దర్శకుడు తేజ ఆ తర్వాత అదే స్థాయిలో పరాజయాలను చవిచూశారు. ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంతో మళ్లీ విజయాన్ని అందుకున్నారు. ఇటీవల బెల్లం కొండ శ్రీనివాస్‌, కాజల్ జంటగా ‌‘సీత’ను తీశారు. షూటింగ్‌ సమయంలో నటీనటులను కొడతారని తేజపై వార్తలు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీని వెనుక కారణాన్ని ఓ సందర్భంలో తేజ పంచుకున్నారు. 

‘‘నేను సెట్‌లో నటీనటులను కొడతానన్న వార్తల్లో నిజం లేదు. అది ఒక ప్రచారం మాత్రమే. తొలి రోజుల్లో నేను దర్శకత్వం వహించిన సినిమాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి. దీంతో పదో తరగతి చదువుకునే వాళ్లు కూడా సినిమాల్లో నటించాలని వచ్చేసేవారు. పరీక్షల ఫీజు కోసం ఇచ్చిన డబ్బులు పట్టుకుని నా దగ్గరకు వచ్చిన వాళ్లూ ఉన్నారు. నేను అవకాశం ఇస్తానని నా ఆఫీస్‌ ముందు గంటల తరబడి నిలబడిన వాళ్లనూ చూశా. ఇంకొందరు ‘మాకు అవకాశం ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటాం’ అంటూ లేఖలు రాసేవారు. దీంతో నేను పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేవాడిని. ఇంకొందరిని తిట్టి పంపేవాడిని. ఇలా చదువును నిర్లక్ష్యం చేసి వచ్చే వారిని అడ్డుకోవాలని అనే ఉద్దేశంతో నేను సెట్‌లో కొడతానని ప్రచారం చేయించా. దీంతో ‘అమ్మో! సరిగా నటించకపోతే కొడతాడేమో’అని భయపడి రాకుండా ఉంటారని అనుకున్నా. కొంత వరకూ అది ఫలితాన్ని ఇచ్చింది’’

‘‘అయితే, నేను ఒక సందర్భంలో హీరోయిన్‌ను కొట్టాను కూడా. ‘నువ్వునేను’ షూటింగ్‌ సమయంలో ఓ సన్నివేశంలో హీరోయిన్‌ ఏడవాల్సి ఉంది. సాధారణంగా అలాంటి సన్నివేశాలు ఉంటే, ముందురోజు నుంచే హీరోయిన్‌ను సిద్ధం చేస్తాం. ఆ రోజు అనుకోకుండా ఆ షాట్‌ తీయాల్సి వచ్చింది. ఎన్ని విధాల చెప్పినా, తనకు ఏడవడం రావటం లేదని ఆ హీరోయిన్‌ చెప్పింది. దీంతో ‘సీన్‌ చేయకపోతే చెంప పగలగొడతా’ అని చెప్పి నిజంగానే లాగిపెట్టి ఒక్కటి కొట్టా. ఆ దెబ్బకు హీరోయిన్‌ ఏడవడం.. సీన్‌ పూర్తవడం రెండూ అయిపోయాయి. అది చూసిన వాళ్లకు నిజంగా నేను కొట్టానేమోనని అనుకుని తెగ ప్రచారం చేశారు. ఇలానైనా చదువును నిర్లక్ష్యం చేసి నా దగ్గరకు వచ్చేవారి సంఖ్య తగ్గుతుందని భావించా’’ అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చారు తేజ.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.